అంతరిక్షంలో పర్యటించాలనుకునే కల సాకారానికి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రయత్నాలు ప్రారంభించింది. 2030 నాటికి స్పేస్ టూరిజం ప్రాజెక్టును పట్టాలెక్కిస్తామన, దీనికి సంబంధించిన పని జరుగుతోందని ఇస్రో చైర్మన్ సోమనాథ్ ఇటీవల ప్రకటించారు. ఇందుకోసం సొంతంగా ఒక మాడ్యూల్ తయారు చేస్తున్నట్టు తెలిపారు.టికెట్ ధర రూ.6 కోట్లు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. అంతరిక్ష పర్యటన ఆర్బిటల్గా ఉంటుందా లేక సబ్ ఆర్బిటల్గా ఉంటుందా అనే దానిపై స్పష్టత లేదు. టికెట్ ధర రూ.6 కోట్లు అంటున్నారు కాబట్టి, ఇది సబ్ ఆర్బిటల్ పర్యటనే అయి ఉండవచ్చని భావిస్తున్నారు. స్పేస్ క్రాఫ్ట్ ప్రయాణించే వేగాన్ని బట్టి ఆర్బిటల్ పర్యటనా, సబ్ ఆర్బిటల్ పర్యటనా అనేది ఆధారపడి ఉంటుందని చెబుతున్నారు. ఆర్బిటల్ స్పేస్ క్రాఫ్ట్ ఆర్బిటల్ వెలాసిటీ (కక్ష్య వేగం)తో ప్రయాణిస్తుంది. సబ్ ఆర్బిటల్ రాకెట్ దాని కంటే తక్కువ వేగంతో ప్రయాణిస్తుంది. సబ్ ఆర్బిటల్ ట్రిప్ అయితే స్పేస్ క్రాఫ్ట్‌లో తిరిగి భూమ్మీదకు వచ్చేప్పుడు అంతరిక్షం అంచుల్లో కొద్ది నిమిషాలు తక్కువ గ్రావిటీ వాతావరణంలో (గాల్లో తేలియాడేలా) ఉన్న అనుభవాన్ని పొందే అవకాశం ఉంటుంది. ఇప్పటికే బ్లూ ఆరిజిన్ కంపెనీ సబ్ ఆర్బిటల్ రాకెట్ టూర్‌ను విజయవంతంగా నిర్వహించింది. 2021లో బ్లూ ఆరిజిన్ అధినేత జెఫ్ బెజోస్ మరో ముగ్గురితో కలిసి అంతరిక్షంలో పర్యటించి వచ్చారు. సబ్ ఆర్బిటల్ రాకెట్లు ఆర్థికంగా అందుబాటులో ఉండటంతోపాటు వాటిని రెండోసారి కూడా వినియోగించే అవకాశం ఉంటుంది. సబ్ ఆర్బిటల్ స్పేస్ టూరిజం మిషన్ సాధ్యాసాధ్యాలపై ఇస్రో అధ్యయనం చేస్తోందని కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ, ఆటామిక్ ఎనర్జీ అండ్ స్పేస్ మంత్రి జితేంద్రప్రసాద్ రాజ్యసభలో ఇటీవల వెల్లడించారు. అంతరిక్ష పర్యాటక మాడ్యూల్‌ను తయారు చేసేందుకు నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్ (ఐఎన్-స్పేస్) ద్వారా ఇస్రో ప్రైవేట్ సంస్థలతో కలిసి పనిచేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు ఇస్రో శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అంతరిక్ష పర్యాటకం చాలాకాలం క్రితమే మొదలైంది. ఆర్బిటల్ స్పేస్ టూరిజాన్ని రష్యన్ స్పేస్ ఏజెన్సీ గతంలోనే ప్రారంభించింది. 2001లో అమెరికన్ మిలియనీర్ డెన్నిస్ టిటో రష్యన్ స్పేస్ ఏజెన్సీకి రూ.165 కోట్లు చెల్లించి స్పేస్ టూరిస్ట్‌గా అంతరిక్షంలో 8 రోజులు గడిపి తిరిగి వచ్చారు. ప్రపంచంలో మొట్టమొదటి స్పేస్ టూరిస్ట్ ఆయనే. కానీ 2010లో రష్యన్ స్పేస్ ఏజెన్సీ స్పేస్ టూరిజం కార్యకలాపాలను నిలిపివేయడంతో అంతరిక్ష పర్యాటకం అక్కడితోనే ఆగిపోయింది.
స్పేస్ టూరిజానికి ఇస్రో రూపకల్పన !
by Telugu Lo Computer at March 23, 2023
Labels:
2030 నాటికి స్పేస్ టూరిజం
,
isro
,
science
,
technologe
,
ఇస్రో చైర్మన్ సోమనాథ్
,
స్పేస్ టూరిజానికి ఇస్రో రూపకల్పన !
,
స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్
About Telugu Lo Computer
This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.
Related Posts
Subscribe to:
Post Comments
(
Atom
)
3


No comments:
Post a Comment