ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న బైక్స్, స్కూటర్స్ ధరలు


ఇప్పటికే టూవీలర్ తయారీ కంపెనీ హీరో మోటొకార్ప్ ధరలు పెంచుతున్నట్లు వెల్లడించింది. దీని వల్ల కొత్తగా హీరో బైక్ లేదా స్కూటర్ కొనే వారిపై ప్రతికూల ప్రభావం పడుతుందని చెప్పవచ్చు. బైక్స్, స్కూటర్ల ధర దాదాపు 2 శాతం వరకు పెరుగుతుందని హీరో మోటొకార్ప్ ప్రకటించింది. ఏప్రిల్ 1 నుంచి ధరల పెంపు ఉంటుందని వెల్లడించింది. ఓబీడీ 1కు బదిలీ కావడం ద్వారా వ్యయాలు పెరుగుతున్నాయని, అందుకే ఇప్పుడు ధరలను పెంచాల్సిన పరిస్థితి నెలకొందని కంపెనీ వివరించింది. కాగా దేశంలో ఏప్రిల్ 1 నుంచి విక్రయించే అన్ని టూవీలర్లు ఓబీడీ 1 నిబంధనలకు అనుగుణంగానే ఉండాలి. అయితే ధరల పెంపు అనేది బైక్ , స్కూటర్ మోడల్, వేరియంట్ ప్రాతిపదికన మారుతుందని కంపెనీ వెల్లడించింది. ధరల పెంపు నేపథ్యంలో కంపెనీ మాత్రం కస్టమర్లకు ఫైనాన్స్ విషయంలో భరోసా ఇస్తోంది. ఆకర్షణీయ ఫైనాన్స్ సదుపాయం అందిస్తామని పేర్కొంటోంది. అందువల్ల హీరో బైక్, స్కూటర్ కొనుగోలు చేయాలని భావించే వారు ఈ బెనిఫిట్ పొందొచ్చని తెలిపింది. హీరో మోటొకార్ప్ ధరల పెంపు నేపథ్యంలో ఇతర టూవీలర్ తయారీ కంపెనీలు కూడా వాటి బైక్స్, స్కూటర్ల ధరలను పెంచే ఛాన్స్ ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కొత్త రూల్స్ అన్ని టూవీలర్లకు వర్తిస్తాయి. ఈ లెక్కన చూస్తే.. కేవలం హీరో మోటొకార్ప్ మాత్రమే కాకుండా ఇతర టూవీలర్ తయారీ కంపెనీలు కూడా వాటి మోడళ్ల ధరలను పెంచే ఛాన్స్ ఉందని చెప్పుకోవచ్చు.

Next Post Previous Post
No Comment
Add Comment
comment url




sr7themes.eu.org