Ad Code

మీసో ఎలక్ట్రిక్ స్కూటర్ !


గేమోపై అనే కంపెనీ పలు రకాల మోడళ్లను మార్కెట్‌లో అందుబాటులోకి తీసుకువచ్చింది. వీటిల్లో మీసో అనే మోడల్ కూడా ఒకటి ఉంది. దేశీయ తొలి సోషల్ డిస్టెన్సింగ్ ఎలక్ట్రిక్ స్కూటర్ అని కంపెనీ పేర్కొంటోంది. దీన్ని మిని ఎలక్ట్రిక్ స్కూటర్‌గా చెప్పుకోవచ్చు. కంపెనీ ఇందులో 250 వాట్ హబ్ మోటార్ అమర్చింది. ఇది గంటకు 25 నుంచి 35 కిలోమీటర్ల వేగంతో వెళ్తుంది. బ్యాటరీ 90 శాతం ఫుల్ కావడానికి 2 నుంచి 3 గంటలు టైమ్ పడుతుంది. బ్యాటరీ కెపాసిటీ 48 వీ 17.5 ఏహెచ్. డిజిటల్ స్పీడో మీటర్ ఉంటుంది. అలాగే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ నడపడానికి లైసెన్స్ ఉండాల్సిన పని లేదు. అంతేకాకుండా ఈ మిని ఎలక్ట్రిక్ స్కూటర్‌కు డిజిటల్ స్పీడో మీటర్ ఉంటుంది. వివిధ రంగుల్లో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ కస్టమర్లకు అందుబాటులో ఉంది. రెడ్, ఆరెంట్, బ్లూ, గ్రీన్ వంటి నాలుగు రంగుల్లో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లభిస్తోంది. ఒక్కసారి ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ఫుల్‌గా చార్జ్ చేస్తే 60 నుంచి 70 కిలోమీటర్ల వరకు వెళ్లొచ్చు. కంపెనీ ఇందులో డ్రమ్ బ్రేక్స్ సిస్టమ్‌ను అమర్చింది. బ్యాటరీపై మూడేళ్ల వరకు వారంటీ లభిస్తుంది. అందువల్ల ఇబ్బంది ఏమీ ఉండదు. బ్యాటరీ ఫుల్ కావడానికి 3 నుంచి 4 గంటలు టైమ్ పట్టొచ్చు. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఎక్స్‌షోరూమ్ ధర రూ. 44 వేలుగా ఉంది. ఆన్‌రోడ్ ధర రాష్ట్రం ప్రాతిపదికన మారుతూ ఉండొచ్చు. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో ట్విన్ షాక్ అబ్జార్బర్లు ఉన్నాయి. ట్రడిషనల్ టెలీ స్కోపిక్ ఫోర్స్క్ అమర్చారు. ఎలక్ట్రిక్ స్కూటర్‌లో బాడీ ప్యానెల్స్ ఏమీ లేవు. అయితే డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ ప్యానెల్ ఉంటుంది. ఎల్ఈడీ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్ ఉంది. ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్ కూడా అమర్చారు. ఎల్ఈడీ టర్న్ ఇండికేటర్లు కూడా ఉన్నాయి. దీన్ని ఎక్కువగా ట్రాన్స్‌పోర్టేషన్ పనులకు వాడుకోవచ్చు. 125 కేజీల వరకు బరువును లాగుతుంది. 

Post a Comment

0 Comments

Close Menu