Ad Code

ఐఫోన్ 15 ప్రొ మోడల్స్ ధర అధికం ?


ఈ ఏడాది చివరిలో కస్టమర్ల ముందుకు రానున్న ఐఫోన్ 15 సిరీస్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఫీచర్లలో కీలక అప్‌గ్రేడ్‌లతో ఈ ప్రీమియం ఫోన్లు ఆకట్టుకోనున్నాయి. ఐఫోన్ 15 ప్రొ మోడల్స్ న్యూ సాలిడ్‌-స్టేట్ బటన్ డిజైన్‌తో రానుండగా ఈ మోడల్స్ ధర అత్యధికంగా ఉంటుందని టెక్ నిపుణులు అంచనా వేస్తున్నారు.లేటెస్ట్ ఐఫోన్స్‌లో భారీ మార్పులు చేపడుతుండటంతో ఐఫోన్ 15 ప్రొ, ఐఫోన్ 15 ప్రొ మ్యాక్స్ మోడల్స్ ధరలు అధికంగా ఉంటాయని టెక్ నిపుణులు జెఫ్ పు పేర్కొన్నారు. స్టాండర్డ్ మోడల్ సైతం కెమెరా, డిజైన్‌, ఇతర ఫీచర్లలో కీలక మార్పులతో రానుందని చెబుతున్నారు. ఇప్పటివరకూ వెల్లడైన లీక్స్ ప్రకారం ఐఫోన్ 15 ప్రొ మ్యాక్స్‌లో మెరుగైన ఆప్టికల్ జూమ్ కోసం యాపిల్ న్యూ పెరిస్కోప్ లెన్స్ వాడుతోంది. ప్రొ వేరియంట్లు మెరుగైన ర్యాం, టైటానియం ఫ్రేమ్‌తో కస్టమర్ల ముందుకు రానున్నాయి. న్యూ ఫోన్లలో యాపిల్ లేటెస్ట్ ఏ17 బయోనిక్ చిప్‌సెట్‌ను వాడనుంది. ఈ ఫీచర్లు, ఇతర అప్‌డేట్ల కారణంగా అప్‌కమింగ్ ఐఫోన్ల ధరలు పెరగనున్నాయి. మరోవైపు న్యూ ఫోన్లను వరుసగా రెండేండ్ల పాటు పాత ధరలకే యాపిల్ ఆఫర్ చేయడంతో ఈసారి ధరల పెంపునకు కంపెనీ మొగ్గుచూపవచ్చని చెబుతున్నారు. ధర, ఫీచర్ల పరంగా స్టాండర్డ్‌, ప్రొ మోడల్స్ మధ్య భారీ వ్యత్యాసం ఉండేలా యాపిల్ వ్యవహరించనుంది. గత ఏడాది మోడల్స్‌తో పోలిస్తే ఐఫోన్ 15 ప్రొ మోడల్స్ ధరలు అధికంగా ఉండనున్నాయి.

Post a Comment

0 Comments

Close Menu