ఎయిర్‌టెల్ ప్రిపెయిడ్ రీచార్జ్ ప్లాన్ ధర 57 శాతం మేర పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఇది వరకే బేస్ ప్లాన్ ధరను పెంచేసింది. అయితే ఎంపిక చేసిన సర్కిళ్లలోనే ఈ ధరల పెంపు ముందుగా అమలు చేసింది. తర్వాత మరి కొన్ని సర్కిళ్లకు ఈ రీచార్జ్ ప్లాన్ ధరల పెంపును విస్తరించింది. ఇప్పుడు ఎయిర్‌టెల్ దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని సర్కిళ్లలోనూ బేస్ ప్లాన్ ధరను పెంచేసింది. అంటే 22 సర్కిళ్లలోనూ ఇకపై బేస్ రీచార్జ్ ప్లాన్ ధర 57 శాతం మేర పెరిగిందని చెప్పుకోవచ్చు. కంపెనీ తన యావరేజ్ రెవెన్యూ పర్ యూజర్ (ఏఆర్‌పీయూ) పెంపు లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకుందని చెప్పుకోవచ్చు. ఏఆర్‌పీయూను రూ. 200 పైకి తీసుకెళ్లాలని కంపెనీ లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు తెలుస్తోంది. గత నవంబర్‌లో తొలిగా టారిఫ్ ధరను పెంచేసింది. ఈ ధరల పెంపు నిర్ణయాన్ని ఒడిశా , హరియాణ వంటి సర్కిళ్లలో అమలులోకి తీసుకువచ్చింది. తర్వాత ఇతర సర్కిళ్లకు ఈ ధరల పెంపు విస్తరించింది. అందువల్ల కస్టమర్లకు ప్రభావం పడుతోందని చెప్పుకోవచ్చు. ఇది వరకు బేస్ ప్రిపెయిడ్ ప్లాన్ ధర రూ. 99గా ఉండేది. అయితే ఇప్పుడు అన్ని సర్కిళ్లలోరూ బేస్ ప్రిపెయిడ్ ప్లాన్ ధర రూ. 155కు చేరింది. కేవలం ఐదు నెలల కాలంలోనే దేశవ్యాప్తంగా కంపెనీ ఈ టారిఫ్ ధరల పెంపును పూర్తిగా అమలులోకి తీసుకువచ్చింది. ఈ రూ. 155 రీచార్జ్ ప్లాన్‌తో కస్టమర్లకు ఒక జీబీ డేటా వస్తుంది. 300 ఎస్ఎంఎస్‌లు పంపొచ్చు. అలాగే అపరిమిత వాయిస్ కాలింగ్ ఫెసిలిటీ ఉంది. అయితే ఈ ప్లాన్ వాలిడిటీ మాత్రం కేవలం 24 రోజులు మాత్రమే. అలాగే సర్వీసులతో పాటుగా కస్టమర్లకు వింక్ మ్యూజిక్, ఫ్రీ హెలో ట్యూన్స్ సర్వీసులు కూడా లభిస్తాయి.
0 Comments