భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ తక్కువ ఖర్చుతోనే కస్టమర్లకు అధిక లాభాలను అందించే బెస్ట్ ప్లాన్స్ అందిస్తోంది. వీటిలో ఎక్కువ లాభాలను అందించే బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. నెలకు కేవలం రూ.147 ఖర్చుతోనే 30 రోజుల అన్ లిమిటెడ్ లాభాలు అందుకోవాలనుకుంటే బెస్ట్ ప్లాన్ వుంది. ఈ ప్లాన్ రీఛార్జ్ తో నెల రోజులు నిశ్చింతగా ఉండవచ్చు. రూ.147 ప్రీపెయిడ్ ప్లాన్ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ అఫర్ చేస్తున్న బెస్ట్ ప్లాన్ లలో ఒకటిగా చెబుతారు. ఈ ప్లాన్ రీచార్జ్ తో అన్ లిమిటెడ్ కాలింగ్ సౌలభ్యం అందుతుంది. అంటే, పూర్తిగా 30 రోజులు హోమ్ నెట్ వర్క్ మరియు ముంబై, ఢిల్లీ లలో కూడా రోమింగ్ కాలింగ్ చేసుకోవచ్చు. అలాగే, ఈ ప్లాన్ తో 10GB డేటా ప్రయోజనాలు కూడా మీకు అందుతాయి. మరొక బెస్ట్ లాంగ్ వ్యాలిడిటీ ప్రీపెయిడ్ ప్లాన్ కోసం చూసినట్లయితే, మీరు రూ.1,198 లాంగ్ వ్యాలిడిటీ ప్లాన్ ను పరిగణలోకి తీసుకోవచ్చు. ఈ ప్లాన్ అందించే ప్రయోజనాలను క్రింద చూడవచ్చు. రూ.1,198 ప్లాన్ బడ్జెట్ ధరలో లాంగ్ వ్యాలిడిటీ కోరుకునే వారికి ఉపయోగపడుతుంది. ఈ ప్లాన్ నెలకు కేవలం 300 కాలింగ్ మినిట్స్, 3GB డేటా మరియు 30 SMS లను అందిస్తుంది. ఈవిధంగా ప్రతీ నెలా మీకు కాలింగ్, డేటా మరియు SMS లాభాలు అందుతాయి. అంటే, 12 నెలలు (365 days) మీరు కాలింగ్, డేటా మరియు SMS లాభాలను ఈ ప్లాన్ తో అందుకోవచ్చు. రూ.1,198 ప్లాన్ ను 12 నెలలకు విభజిస్తే నెలకు కేవలం రూ.99 రూపాయల ఖర్చు మాత్రమే అవుతుంది. అయితే, కాలింగ్ మరియు డేటా ఎక్కువగా కోరుకునే వారికి ఈ ప్లాన్ సరిపోకపోవచ్చు. కానీ, తక్కువ ధరలో రెగ్యులర్ వాడకానికి ఈ ప్లాన్ సరిపోతుంది.
బీఎస్ఎన్ఎల్ రూ.147 బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్ !
by Telugu Lo Computer at March 13, 2023
Labels:
30 రోజులు హోమ్ నెట్ వర్క్ మరియు ముంబై
,
BSNL
,
internet
,
prepaid
,
technologe
,
ఢిల్లీ లలో కూడా రోమింగ్ కాలింగ్
,
బీఎస్ఎన్ఎల్ రూ.147 బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్
About Telugu Lo Computer
This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.
Related Posts
Subscribe to:
Post Comments
(
Atom
)
3


No comments:
Post a Comment