Ad Code

ఓటీపీతో పనిలేకుండానే డబ్బులు గోవిందా...గోవిందా !


ఉత్తరాఖండ్ లోని డెహ్రాడూన్‌లో కొత్తరకం సైబర్ నేరం జరిగింది. స్కూల్ మేనేజర్‌గా పని చేస్తున్న వ్యక్తి రూ.95,000 మోసపోయాడు. వన్‌టైమ్‌ పాస్‌వర్డ్‌ అవసరం లేకుండానే సైబర్‌ నేరగాళ్లు బాధితుడి అకౌంట్‌ నుంచి క్యాష్ మాయం చేశారు. డెహ్రాడూన్‌లోని నెహ్రూ కాలనీకి చెందిన శంభుప్రసాద్ పంచోలి, ఒక స్కూల్ మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. ఈ పాఠశాలలో ఓ విద్యార్థికి తండ్రిలా నటించిన మోసగాళ్లు, ఫిషింగ్‌ లింక్స్ ద్వారా అతడిని మోసం చేశారు. వన్-టైమ్ పాస్‌వర్డ్ అడగకుండానే లావాదేవీలు జరిపారు. బాధితుడి మొబైల్ ఫోన్‌కి మొత్తం నాలుగు లింక్‌లు పంపి డబ్బులు డ్రా చేసుకున్నారు. ఫిబ్రవరి 15న శంభుప్రసాద్ పంచోలికి ఓ ఫోన్‌ వచ్చింది. అవతలి వ్యక్తి పాఠశాలలో చదువుతున్న విద్యార్థి పియూష్‌ తండ్రిగా పరిచయం చేసుకున్నాడు. ఆన్‌లైన్‌ ద్వారా విద్యార్థి పియూజ్‌ స్కూల్‌ ఫీజు చెల్లించాలని అనుకుంటున్నట్లు శంభుప్రసాద్‌తో చెప్పాడు. ఫోన్‌లో అవతలి వ్యక్తి చెప్పిన విద్యార్థి పేరున ఫీజు బకాయి ఉండటంతో నిజంగానే విద్యార్థి తండ్రి ఫోన్‌ చేసినట్లు స్కూల్‌ మేనేజర్‌ భావించాడు. సైబర్‌ మోసగాడు వాట్సాప్‌లో నాలుగు లింక్‌లను శంభుప్రసాద్‌కి పంపాడు. ఆ లింక్‌లపై క్లిక్‌ చేస్తే ఫీజు స్వీకరించవచ్చని నమ్మించాడు. అనంతరం మోసగాడు చెప్పిన స్టెప్స్ అన్నీ శంభుప్రసాద్‌ ఫాలో అయ్యాడు. దీంతో నాలుగు ట్రాన్సాక్షన్‌లలో శంభుప్రసాద్‌ బ్యాంక్‌ అకౌంట్‌ నుంచి మొత్తం రూ.95,000 ట్రాన్స్‌ఫర్‌ అయినట్లు బ్యాంక్‌ నుంచి ఫోన్‌కి మెసేజ్‌లు వచ్చాయి. మోసపోయినట్లు గ్రహించిన స్కూల్‌ మేనేజర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.


Post a Comment

0 Comments

Close Menu