బ్రెజిల్‌లోని రియో డి జనీరోలో రోచా ఈత కొట్టేందుకు వెళ్లాడు. అదే సమయంలో ఆపిల్ వాచ్‌ని నీళ్లలో పొగొట్టుకున్నాడు. ఈత కొడుతుండగా చేతికి ధరించిన ఆపిల్ వాచ్ నీళ్లలో పడిపోయింది. రోచా వెంటనే తన ఆపిల్ వాచ్‌ని కనుగొనేందుకు ప్రయత్నించాడు, కానీ సాధ్యపడలేదు. అతను తన గడియారాన్ని గుర్తించడానికి ఫైండ్ మై యాప్‌ని ఉపయోగించాడు. ఆసక్తికరంగా నీటి అడుగున ఉన్న తన ఆపిల్ వాచ్ గుర్తించాడు. ఎందుకంటే.. ఈ ఆపిల్ వాచ్‌లో GPS ఉంది. నీటి-నిరోధకత కలిగిన వాచ్ అని సంగతి అతడికి తెలియదు. వాచ్ పనిచేయదని భావించాడు. కానీ, రోచాకు ఫైండ్ మై యాప్ నుంచి వాచ్ ఆన్ అయిందని నోటిఫికేషన్ వచ్చింది. రోచా లాస్ట్ మోడ్‌ను ఆన్ చేసి.. ఆపై సంబంధించిన కొంత డేటాను రిజిస్టర్ చేసింది. వెంటనే అతను ఆపిల్ వాచ్‌ను కనుగొన్నట్లు తెలిపాడు. ఆపిల్ వాచ్‌ను కనుగొన్న వ్యక్తి కుమార్తె మెసేజ్ చేసింది. బిజియోస్లో ఉన్నానని, తమకు వాచ్ దొరికిందని, ఆమె తండ్రి వాచ్ తిరిగి ఇవ్వాలని కోరిందని రోచా చెప్పారు. ఈ వాచ్ 50 ఏళ్ల డైవర్ కనుగొన్నాడు, అతను 16 ఏళ్ల అమ్మాయి తండ్రి.. అతను కోరల్ పార్క్‌ను చూసుకుంటాడు. అంతేకాదు.. పోగొట్టుకున్న వస్తువులను గుర్తించి యజమానులకు తిరిగి ఇస్తుంటాడు. ఫిహో అనే డైవర్ ఆపిల్ వాచ్‌ను కనుగొన్నప్పుడు అది బాగానే పనిచేస్తుందని చెప్పాడు. అయితే, అతని కుమార్తెకు కూడా ఆపిల్ వాచ్ ఉంది. దాంతో అతడు ఆ డివైజ్ ఛార్జర్ పెట్టాడు. కొద్దిసేపటి తర్వాత ఆపిల్ వాచ్ ఆన్ అయింది. వెంటనే ఫైండ్ మై యాప్ మెసేజ్ చూపించింది. నెల రోజుల పాటు సముద్రంలో ఉన్నా ఆపిల్ వాచ్ వర్కింగ్ కండిషన్లో ఉండటం చూసి ఆశ్చర్యపోయారు. చివరికి ఆపిల్ వాచ్‌ను రోచాకు తిరిగి ఇచ్చాడు.
సముద్రంలో పడినా చెక్కు చెదరని ఆపిల్ వాచ్ !
by Telugu Lo Computer at March 30, 2023
Labels:
apple
,
apple watch
,
technologe
,
ఆపిల్ వాచ్‌లో GPS ఉంది
,
బ్రెజిల్‌లోని రియో డి జనీరోలో రోచా ఈత కొట్టేందుకు వెళ్లాడు
,
సముద్రంలో పడినా చెక్కు చెదరని ఆపిల్ వాచ్ !
About Telugu Lo Computer
This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.
Related Posts
Subscribe to:
Post Comments
(
Atom
)
3


No comments:
Post a Comment