4వేల మంది ఉద్యోగులను తొలగించాలని డిస్నీ యోచిస్తున్నది. రిట్రెంచ్ చేయాల్సి ఉద్యోగులను గుర్తించాలని కంపెనీ మేనేజర్లను ఆదేశించినట్లు సమాచారం. ఏప్రిల్‌లో కంపెనీ తొలగింపులను చేపట్టనున్నది. అయితే, ఉద్యోగుల తొలగింపు చిన్న చిన్న గ్రూప్‌లుగా తొలగిస్తారా..? లేదంటే ఒకేసారి నాలుగువేల మందిని ఇంటికి పంపుతారా? అన్న విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. ఏప్రిల్ 3న డిస్నీ వార్షిక సమావేశం జరగనుంది. వాస్తవానికి కంపెనీ ఏడు బిలియన్ డాలర్లు చేయాలని భావిస్తుందని, ఇదే తొలగింపులకు కారణంగా తెలుస్తున్నది. ఎంటర్టైన్మెంట్ కంపెనీ తన స్ట్రీమింగ్ సర్వీస్ లపై దృష్టి పెట్టి.. స్ట్రీమింగ్ సర్వీస్ బిజినెస్‌ను తగ్గించుకునే అవకాశం ఉన్నట్లుగా నివేదికలు పేర్కొంటున్నాయి. ఇంతకు ముందు కంపెనీ సీఈవో బాబ్ ఇగర్ ఫిబ్రవరిలో 7 వేల మంది ఉద్యోగులను డిస్నీ తొలగిస్తుందని ప్రకటించారు. దాంతో దీంతో కంపెనీకి దాదాపు ఏడు బిలియన్ డాలర్లు ఆదా కానున్నది. అదే సమయంలో కంటెంట్‌ను తగ్గించడంతో పాటు ఉద్యోగుల జీతంలోనూ కోత పెట్టేందుకు కంపెనీ యోచిస్తున్నది. ఇదిలా ఉండగా.. పలు కంపెనీలు సైతం పెద్ద సంఖ్యలో ఉద్యోగులను పక్కనపెడుతున్నాయి. ఈ క్రమంలోనే మరో వైపు మెటా సంస్థలో భారీగా ఉద్యోగులను తొలగించనున్నది. దాదాపు 10వేల మంది ఉద్యోగులను తొలగించాలని మెటా యోచిస్తున్నది. ఇప్పటికే దాదాపు 11 వేల మంది ఉద్యోగులను తొలగించింది. కమ్యూనికేషన్ టెక్నాలజీ కంపెనీ జూమ్ కూడా తన ఉద్యోగులలో 15 శాతం మందిని తగ్గించుకోవాలని ప్రణాళిక రూపొందించింది. ఇందులో భాగంగా దాదాపు 1500 మంది ఉద్యోగులను పక్కనబెట్టింది.
4వేల మంది ఉద్యోగులను తొలగించే యోచనలో డిస్నీ ?
by Telugu Lo Computer at March 19, 2023
Labels:
4వేల మంది ఉద్యోగులను తొలగించే యోచనలో డిస్నీ ?
,
entertenment
,
technologe
,
ఏప్రిల్ 3న డిస్నీ వార్షిక సమావేశం జరగనుంది
,
ఏప్రిల్‌లో కంపెనీ తొలగింపులను చేపట్టనున్నది
About Telugu Lo Computer
This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.
Related Posts
Subscribe to:
Post Comments
(
Atom
)
3


No comments:
Post a Comment