బ్రిటీష్ శాస్త్రవేత్తల బృందం ముసలి ఎలుకలను యవ్వనంగా మార్చడానికి దాని మలాన్ని ఉపయోగించింది. ఈ ప్రయోగం కోసం, శాస్త్రవేత్తలు చిన్న ఎలుకల మలాన్ని వృద్ధ ఎలుకలలోకి మార్పిడి చేశారు. ఈ మలం ద్వారా ఎలుకలోకి చేరిన సూక్ష్మ జీవులు దాని శరీరానికి మంచి ప్రయోజనం కలిగించాయి. సైన్స్ అలర్ట్ నివేదిక ప్రకారం, మార్పిడి తర్వాత, వృద్ధ ఎలుక ప్రేగులు, కళ్ళు ఇంకా మెదడు చిన్న ఎలుకకు సమానమైన సామర్థ్యాలను కలిగి ఉన్నాయి. ఆశ్చర్యకరమైన ఫలితాలు వెలువడిన తర్వాత, శాస్త్రవేత్తలు మరో ప్రయోగాన్ని కూడా చేశారు, అంటే వృద్ధ ఎలుక మలాన్ని మగ ఎలుకలోకి వారు మార్పిడి చేశారు. ఇలా చేయడంతో చిన్న ఎలుకలో ముసలి ఎలుక లక్షణాలు అనేవి కనిపించాయి. వాటి మెదడులో వాపు కూడా పెరిగింది. ఇది కంటి చూపుకు కారణమని భావించే ప్రొటీన్ లోపం ఉంది. ఈ విధంగా పెరుగుతున్న వయస్సు ప్రభావం వాటిపై కనిపించడం స్టార్ట్ అయ్యింది. ఇక ఒక వ్యక్తికి వృద్ధాప్యం వచ్చినప్పుడు అతని ప్రేగులు అనేవి సరిగ్గా పనిచేయవని శాస్త్రవేత్తలు చెబుతారు.. ఇది ప్రయోగం ద్వారా కూడా రుజువైంది. పేగు మైక్రోబయోటా, అంటే సూక్ష్మజీవులు ఇంకా వయస్సు సంబంధిత వ్యాధుల పురోగతిపై ప్రభావం చూపుతుంది. ప్రయోగం సమయంలో యువ ఎలుక మల మైక్రోబయోటా వృద్ధ ఎలుకకు మార్పిడి చేయసినప్పుడు మార్పు స్పష్టంగా కనిపించింది.ఇక ప్రస్తుతానికి ఎలుకలపైనే ఈ ప్రయోగం చేశామని, అయితే మానవ జీవితంలో పేగు మైక్రోబయోటాకు చాలా ముఖ్యమైన పాత్ర కూడా ఉందని శాస్త్రవేత్తలు తెలిపారు.ప్రేగులలో ప్రయోజనం కలిగించే సూక్ష్మజీవులు అనేవి కూడా ఉండటం వల్ల శరీరం సరైన రీతిలో పనిచేయడానికి సహాయపడుతుంది.
ముసలి ఎలుకను యవ్వన ఎలుకగా మార్చిన శాస్త్రవేత్తలు!
by Telugu Lo Computer at May 09, 2022
Labels:
science
,
technologe
,
ముసలి ఎలుకను యవ్వన ఎలుకగా మార్చిన శాస్త్రవేత్తలు
,
యవ్వనంగా మార్చడానికి దాని మలాన్ని ఉపయోగించింది
About Telugu Lo Computer
This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.
Related Posts
Subscribe to:
Post Comments
(
Atom
)
3


No comments:
Post a Comment