27న దేశంలో అతిపెద్ద డ్రోన్ ఫెస్టివల్


దేశంలో అతి పెద్ద డ్రోన్ ఫెస్టివల్ భారత్ డ్రోన్ మహోత్సవ్ ఈనెల 27న ఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో ప్రారంభం కానుంది. రెండు రోజుల పాటు జరిగే డ్రోన్ ఫెస్టివల్‌ను ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం ప్రారంభింనున్నారు. ఈ ప్రదర్శనలో ప్రభుత్వ అధికారులు, విదేశీ దౌత్యవేత్తలు, సాయుధ బలగాలు, కేంద్ర సాయుధ పోలీస్ బలగాలు, పీఎస్‌యూలు, ప్రైవేట్ కంపెనీలు, డ్రోన్ స్టార్టప్‌లకు చెందిన 1600 మందికి పైగా ప్రతినిధులు పాల్గొంటారు. ప్రగతి మైదాన్‌లో శుక్రవారం ఉదయం పదిగంటలకు భారత్ డ్రోన్ మహోత్సవ్‌-2022ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభిస్తారని ప్రధాని కార్యాలయం (పీఎంఓ) వెల్లడించింది. ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీ కిసాన్ డ్రోన్ పైలట్లతో ముచ్చటించి ఆపై ఓపెన్ ఎయిర్ డ్రోన్ ప్రదర్శలను వీక్షిస్తారు. ఎగ్జిబిషన్ సెంటర్‌లో 70కి పైగా ఎగ్జిబిటర్స్ పొల్గొని డ్రోన్లను ప్రదర్శిస్తారు. ఈ ప్రదర్శన సందర్భంగా పెద్ద ఎత్తున ప్రోడక్ట్ లాంఛ్‌లు, ప్యానెల్ చర్చలు, మేడిన్ ఇండియా డ్రోన్ ట్యాక్సీ ప్రొటోటైప్ ప్రదర్శనలు ఉంటాయని నిర్వాహకులు తెలిపారు.


Next Post Previous Post
No Comment
Add Comment
comment url




sr7themes.eu.org