Ad Code

యాప్ అవసరం లేకుండా ఎవరు కాల్ చేశారో తెలుసుకోవచ్చు?


ఎటువంటి యాప్ అవసరం కూడా లేకుండా మీకు ఎవరు కాల్ చేశారో ఇట్టే తెలుసుకోవచ్చు. అవును, రాబోయే రోజుల్లో స్మార్ట్ ఫోన్ లో అద్భుతమైన ఫీచర్ రాబోతోంది. ఈ సదుపాయాన్ని టెలికాం వినియోగదారులకు అందించేలా టెలికాం రెగులేటరీ అథారిటీ ఆఫ్‌ ఇండియా-ట్రాయ్ ఆలోచిస్తోంది. కొత్త నెంబర్ నుంచి కాల్ వస్తే వారి పేరు కూడా వచ్చేలా ట్రాయ్ ప్లాన్ చేస్తోంది. అంటే, ఎవరైనా తెలియని వ్యక్తుల నుంచి కాల్ వచ్చినప్పుడు వారి పేరు మన మెుబైల్ స్కీన్ పై కనిపించనుంది. ఈ మేరకు దీనికి అవసరమైన చర్యలు తీసుకోవాలని కేంద్ర టెలికాం విభాగం.. ట్రాయ్ కు సూచించింది. ఈ విధానం అమల్లోకి వస్తే కాల్ చేస్తున్న వారిని గుర్తించడంతో పాటు కచ్చితత్వం, పారదర్శకత వస్తుందన్నది ట్రాయ్ ఆలోచన. ఫోన్ కనెక్షన్ తీసుకునే సమయంలో టెలికాం కంపెనీలకు కస్టమర్ అందించే కేవైసీ ఆధారంగా కాల్ చేస్తున్న వారి పేరు ఫోన్ స్క్రీన్ మీద చూడొచ్చు. ఈ కొత్త ఫీచర్ ట్రూ కాలర్ లాంటి మెకానిజమ్ అన్న మాట. ట్రూ కాలర్ యాప్ ద్వారా కాల్ చేసిన వ్యక్తి పేరు తెలుసుకునే అవకాశం ఉందన్న విషయం తెలిసిందే. అయితే, అందులో కనిపించే పేరు, కేవైసీ ఆధారంగా ఉన్నది మాత్రం కాదు. కొత్త నెంబర్ నుంచి ఫోన్‌ కాల్ వస్తే వారి పేరు తెలిసేలా చర్యలు తీసుకోవాలని, ఈ మేరకు ఈ అంశంపై పరిశ్రమతో సంప్రదింపులు జరపాలంటూ టెలికం శాఖ నుంచి తమకు సూచన అందినట్లు ట్రాయ్‌ వెల్లడించింది. కొన్ని నెలల్లో సంప్రదింపులు మొదలుకానున్నాయని ట్రాయ్‌ చైర్మన్‌ వాఘేలా తెలిపారు. ఇప్పటివరకు మన ఫోన్‌ కాంటాక్ట్స్‌ జాబితాలో ఉన్నవారి నుంచి కాల్‌ వస్తే వారి పేరు మొబైల్‌ స్క్రీన్‌ మీద కనిపించేది. ఇకపై తెలియని వ్యక్తులు, లేదా నెంబర్ల నుంచి కాల్ వచ్చినా సదరు వ్యక్తికి సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు వీలు కలుగుతుంది. కాగా, ఈ కొత్త కాలర్ ఐడీ ఫీచర్ యూజర్ అనుమతిపై పని చేస్తుందని తెలుస్తోంది. అంటే, తమ పేరు ప్రదర్శించాలా వద్దా అనే ఆప్షన్ ను యూజర్లు ఎంచుకోవచ్చు. ”దేశంలోని స్మార్ట్‌ఫోన్ వినియోగదారులందరికీ స్పామ్ కాల్‌లను నివారించడంలో సహాయపడటానికి ట్రాయ్ ఒక ఫీచర్‌పై పనిచేస్తోంది. ఎవరు కాల్ చేస్తున్నారో వారి పేరు మొబైల్ స్క్రీన్‌పై కనిపించే విధంగా సర్వీస్ ప్రొవైడర్లను అనుమతించే వ్యవస్థను రూపొందించాలని ట్రాయ్ చూస్తోంది” అని సంబంధిత విభాగం అధికారి ఒకరు తెలిపారు. ప్రస్తుతం ఈ ఫీచర్‌పై చర్చలు జరుగుతున్నాయి. ఇది కానీ అమల్లోకి వస్తే.. ఇక ట్రూ కాలర్ లాంటి యాప్ అవసరం ఉండకపోవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.


Post a Comment

0 Comments

Close Menu