Ad Code

వాయిస్ కాల్స్ ఎలా రికార్డ్ చేయాలి ?


నార్మల్ కాల్స్ కంటే వాట్సాప్ కాల్స్ లోనే మాట్లాడుకోవడం ఎక్కువైంది. వాయిస్ తోపాటు వీడియో కాల్స్ కూడా మాట్లాడుకునే సదుపాయం వాట్సాప్ లో ఉండటంతో వాట్సాప్ కాల్స్ ను ఎక్కువగా వాడుతున్నారు. చాట్, లైవ్ లొకేషన్, ఫొటోలు, వీడియోలు, ఫైల్స్ షేర్ చేయడం ప్రపంచంలో ఎక్కడున్నా సరే వారితో కాల్స్ మాట్లాడుకునే సౌలభ్యం వాట్సాప్ లో ఉంది. అయితే స్మార్ట్ ఫోన్ల నుంచి కాల్స్ చేస్తే…రికార్డింగ్ ఆప్షన్ ఉంటుంది. మరి వాట్సాప్ లో ఆ సదుపాయం లేదు. దీనికోసం ప్రత్యామ్నాయ మార్గాలను వెతుక్కోవల్సిందే. అయితే ముఖ్యమైన విషయాలను ఎవరూ వినకుండా…రికార్డింగ్ చేసుకోవాలనుకుంటే…ఎవరూ లేని చోటకు వెళ్లి కాల్ చేసుకోవడం ఉత్తమం. థర్డ్ పార్టీ యాప్స్ అంత సురక్షితం కావు. గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవడం బెస్ట్. కాల్ రికార్డర్ క్యూబ్ ACRయాప్ ను ఇన్ స్టాల్ చేయాలి. యాప్ డౌన్ లోడ్ చేసిన తర్వాత మీ ఫోన్లో ని యాక్సెసిబిలిటీని సెట్టింగ్స్ విభాగంలో క్యూబ్ ACR యాప్ ను కనెక్టర్ ని ప్రారంభించాలి. బ్యాటరీ ఆప్టిమైజేషన్ ఫీచర్ను మర్చిపోకుండా సెలక్ట్ చేసుకోవాలి. ఈ యాప్ ను ఫోన్లో ఇన్ స్టాల్ చేసిన తర్వాత ఏ యాప్ కు సంబంధించి కాల్స్ రికార్డు చేయాలన్నది తెలియజేయాలి.

Post a Comment

0 Comments

Close Menu