ముంబయిలోని బీకేసీ జియో వరల్డ్ సెంటర్లో ప్రపంచంలోనే అతి పెద్ద ప్యాసింజర్ ఎలివేటర్‌ను ఏర్పాటు చేశారు. దీనిని ముంబాయి బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లోని జియో వరల్డ్ సెంటర్లో ఏర్పాటు చేసినట్టుగా కోన్ ఎలివేటర్స్ ఇండియా కంపెనీ వెల్లడించింది. ఈ ఎలివేటర్ ఒకేసారి 200 మంది మోయగల సామర్థ్యం ఉంటుంది. 5-స్టాప్, 16 టన్నుల ఎలివేటర్ 25.78 చదరపు అడుగులకు పైగా విస్తీర్ణంలో దీనిని ఏర్పాటు చేసింది. నాణ్యత, భద్రత ప్రమాణాలతో దీనిని ఏర్పాటు చేసినట్లు కోన్ ఎలివేటర్స్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ అమిత్ గోస్సెయిన్ తెలిపారు. ప్రత్యేకంగా రూపొందించిన ఈ ఎలివేటర్ ధరను వెల్లడించేందుకు కంపెనీ నిరాకరించింది. జియో వరల్డ్ సెంటర్ ఆఫ్ రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్‌లో 188 ఎలివేటర్లు, ఎస్కలేటర్లను ఏర్పాటు చేసినట్లు గోస్సెయిన్ పేర్కొన్నారు. కోన్ ఎలివేటర్స్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ అమిత్ గోస్సేన్ మాట్లాడుతూ.. ప్రపంచంలోనే అతిపెద్ద ప్యాసింజర్ ఎలివేటర్ కోన్ ద్వారా ఉందని, అది భారతదేశంలోనే ఉన్న విషయాన్ని ప్రకటించడానికి ఎంతో సంతోషిస్తున్నామని అన్నారు. భారత్‌లోని మా బృందంతో పాటు, కోన్ గ్లోబల్‌లోని ప్రధాన ప్రాజెక్ట్‌ల నిపుణుల బృందం సంక్లిష్టమైన ప్రాజెక్ట్‌ను రూపొందించించిందని అన్నారు.
ప్రపంచంలోనే పెద్ద ప్యాసింజర్ ఎలివేటర్ !
by Telugu Lo Computer at May 24, 2022
Labels:
science
,
technologe
,
ఎస్కలేటర్ల ఏర్పాటు
,
కోన్ ఎలివేటర్స్ ఇండియా కంపెనీ
,
జియో వరల్డ్ సెంటర్ ఆఫ్ రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్‌లో 188 ఎలివేటర్లు
,
ప్రపంచంలోనే పెద్ద ప్యాసింజర్ ఎలివేటర్ !
About Telugu Lo Computer
This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.
Related Posts
Subscribe to:
Post Comments
(
Atom
)
3


No comments:
Post a Comment