Ad Code

వివో టీ1 44W కొత్త ఫోన్ విడుదల


వివో మనదేశంలో కొత్త బడ్జెట్ 4జీ ఫోన్ విడుదల చేసింది. అదే వివో టీ1 44W. 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 44W ఫాస్ట్ చార్జింగ్ వంటి ఫీచర్లు ఈ స్మార్ట్ ఫోన్‌లో ఉన్నాయి. ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టంపై వివో టీ1 44W పనిచేయనుంది. ఈ స్మార్ట్ ఫోన్‌లో రెండు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో 4 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.14,499గా ఉంది. టాప్ ఎండ్ వేరియంట్ అయిన 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ ధర రూ.15,999గా నిర్ణయించారు. ఐస్ డాన్, మిడ్ నైట్ గెలాక్సీ, స్టారీ స్కై కలర్ ఆప్షన్లలో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. ఈ స్మార్ట్ ఫోన్ సేల్ మే 8వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. మే 31వ తేదీ లోపు బ్యాంకు కార్డుల ద్వారా దీన్ని కొనుగోలు చేస్తే రూ.1,500 వరకు తగ్గింపు లభించనుంది. అంటే రూ.12,999కే దీన్ని కొనుగోలు చేయవచ్చన్న మాట. ఆండ్రాయిడ్ 12 ఆధారిత ఫన్‌టచ్ ఓఎస్ 12 ఆపరేటింగ్ సిస్టంపై వివో టీ1 44W పనిచేయనుంది. ఇందులో 6.44 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ అమోఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. 8 జీబీ వరకు ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ అందించారు. మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా స్టోరేజ్‌ను 1 టీబీ వరకు పెంచుకునే అవకాశం ఉంది. వివో టీ1 44W బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్‌గా ఉంది. 44W ఫాస్ట్ చార్జింగ్‌ను ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది. ఆక్టాకోర్ క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 680 ప్రాసెసర్‌పై వివో టీ1 44W పని చేయనుంది. దీని మందం 0.84 సెంటీమీటర్లుగానూ... బరువు 182 గ్రాములుగానూ ఉంది. కెమెరాల విషయానికి వస్తే... వెనకవైపు మూడు కెమెరాలు అందించారు. 64 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాతో పాటు 2 మెగాపిక్సెల్ బొకే కెమెరా, 2 మెగాపిక్సెల్ మాక్రో లెన్స్ కూడా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 16 మెగాపిక్సెల్ అందించారు. 4జీ ఎల్టీఈ, వైఫై, బ్లూటూత్, జీపీఎస్/ఏ-జీపీఎస్, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు, 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్ వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఈ స్మార్ట్ ఫోన్‌లో ఉన్నాయి. యాక్సెలరో మీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, మ్యాగ్నెటోమీటర్, ప్రాక్సిమిటీ సెన్సార్లు కూడా ఇందులో అందించారు. ఇక ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ ఫోన్ పక్కభాగంలో ఉంది.

Post a Comment

0 Comments

Close Menu