ఫ్లిప్‌కార్ట్ కొత్త ప్రొడక్ట్స్‌తో పాటు రీఫర్బిష్డ్ స్మార్ట్‌ఫోన్లకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుంది. ఏదైనా టెక్నికల్ ప్రాబ్లమ్ ఉన్న, రిపేర్‌కు వచ్చిన డివైజ్‌లను కంపెనీ స్వయంగా రిపేర్ చేసి, కొత్త ఫోన్ కంటే తక్కువ ధరలో అందిస్తుంది. వీటిని రీఫర్బిష్డ్ ఫోన్లు అంటారు. ఇలాంటి స్మార్ట్‌ఫోన్ల విక్రయాలు ఫ్లిప్‌కార్ట్‌లో మళ్లీ ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో రీఫర్బిష్డ్ ఐఫోన్లు, ఇతర ఆండ్రాయిడ్ ఫోన్‌లను తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు. ఐఫోన్ 6, 6s, 6s ప్లస్, ఐఫోన్ SE, ఐఫోన్ 7, ఐఫోన్ 8లను బడ్జెట్ ధరలో సొంతం చేసుకోవచ్చు. వీటితోపాటు రెడ్‌మీ, మోటొరోలా, శామ్‌సంగ్ వంటి ఇతర బ్రాండ్ల రీఫర్బిష్డ్ స్మార్ట్‌ఫోన్‌లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఇవి కొత్త ఫోన్ల మాదిరిగానే పనిచేస్తాయి. క్వాలిటీ చెక్ ప్రాసెస్ తర్వాతే సంస్థ వీటిని కస్టమర్ల కోసం అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇలాంటి యూజ్డ్ ఫోన్లు 47 క్వాలిటీ చెక్స్ తర్వాత ఫ్లిప్‌కార్ట్‌లో లిస్ట్ అవుతాయి. రీఫర్బిష్డ్ గోల్డ్ కలర్ వేరియంట్ యాపిల్ ఐఫోన్ 6ఎస్, 64GB మోడల్ కేవలం రూ.10,899కి అందుబాటులో ఉంది. ఇది టచ్ ఐడీతో 4.7 అంగుళాల రెటినా డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది 5MP సెల్ఫీ లెన్స్‌తో పాటు 12MP రియర్ కెమెరాతో వస్తుంది. iPhone 6sలో A9 చిప్‌సెట్ ఉంది. 16GB ఐఫోన్ 6s ధర రూ.9,999గా ఉంది. సిల్వర్, స్పేస్ గ్రే కలర్ ఆప్షన్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ కేటగిరీలో ఐఫోన్ 6 సిరీస్ ఫోన్లు కూడా లభిస్తున్నాయి. యాపిల్ ఐఫోన్ 7 కేవలం రూ.14,529కి అందుబాటులో ఉంది. ఇది ఐఫోన్ 8లో ఉన్న ఫీచర్లతో లభిస్తుంది. కెమెరాలు, స్క్రీన్ సైజ్ ఒకేలా ఉంటాయి. అయితే ఇది A10 ఫ్యూజన్ ప్రాసెసర్‌తో వస్తుంది. 64GB RAM ఉన్న రీఫర్బిష్డ్ గూగుల్ పిక్సెల్ 3 XL ఫోన్ ధర ఫ్లిప్‌కార్ట్‌లో రూ.13,999గా ఉంది. పిక్సెల్ 3 XL ఫోన్ 6.3 అంగుళాల QHD+ డిస్ప్లే, 12.2MP రియర్ కెమెరాతో వస్తుంది. ఇది డ్యూయల్ 8MP సెల్ఫీ లెన్స్‌లతో ఆకట్టుకుంటుంది. స్నాప్‌డ్రాగన్ 845 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. 3,430mAh బ్యాటరీ కెపాసిటీ దీని సొంతం. 64GB మోడల్ రీఫర్బిష్డ్ పిక్సెల్ 3a స్మార్ట్‌ఫోన్ ఫ్లిప్‌కార్ట్‌లో రూ.10,789 వద్ద లభిస్తోంది. ఇది 5.6 అంగుళాల FHD+ డిస్‌ప్లేతో వస్తుంది. పిక్సెల్ 3 XL ఫోన్‌లో ఉండే రియర్ లెన్స్‌తో అందుబాటులో ఉంటుంది. అయితే సెల్ఫీల కోసం ఒక 8MP సెన్సార్ మాత్రమే ఉంది. 3,000mAh బ్యాటరీ, క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 670 చిప్‌సెట్ ఉంది.
0 Comments