అమెజాన్‌లో ఐఫోన్ 12పై భారీ డిస్కౌంట్
అమెజాన్‌లో ఐఫోన్లపై భారీ డిస్కౌంట్లను అందిస్తోంది. ఆపిల్ ఐఫోన్ 13 మాత్రమే కాదు, ఐఫోన్ 12తో సహా అనేక ఇతర ఆపిల్ ఐఫోన్ మోడళ్లు భారత మార్కెట్లో భారీ తగ్గింపుతో అమ్ముడవుతున్నాయి. అమెజాన్ ప్రస్తుతం ఐఫోన్ 12 64GB స్టోరేజీపై రూ. 12,000 ఫ్లాట్ డిస్కౌంట్ అందిస్తోంది. తగ్గింపు ధరతో ఐఫోన్ 12ను రూ. 53,900కే సొంతం చేసుకోవచ్చు. అలాగే రూ. 12,000 డిస్కౌంట్ iPhone 13 మోడల్ బ్లూ, రెడ్ కలర్ ఆప్షన్లపై మాత్రమే అందుబాటులో ఉంది. ఐఫోన్ 12 64GB స్టోరేజ్ మోడల్ పర్పుల్, వైట్ కలర్ ఆప్షన్‌లలో వరుసగా రూ. 5,000, రూ. 10,000 ఫ్లాట్ డిస్కౌంట్లతో లభిస్తున్నాయి. ఆపిల్ ఆన్‌లైన్ స్టోర్‌లో ఐఫోన్ 12 అధికారికంగా రూ. 65,900 అందుబాటులో ఉంది. అమెజాన్ ప్లాట్ ఫాంపై iPhone 12 (128GB స్టోరేజ్) మోడల్‌పై రూ.11,000 వరకు డిస్కౌంట్ అందిస్తోంది. దీని ధర రూ. 59,900కి తగ్గింది. వాస్తవానికి, iPhone 12 128GB స్టోరేజ్ మోడల్‌ను రూ. 70,900 ధరతో లాంచ్ అయింది. అదనంగా, ఈ-కామర్స్ దిగ్గజం బ్యాంక్ ఆఫ్ బరోడా క్రెడిట్ కార్డ్‌లపై రూ. 11,650 వరకు ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ రూ. 2,000 వరకు తగ్గింపును అందిస్తోంది. మీరు iPhone 12 కోసం ఎక్స్ఛేంజ్ ఆఫర్ కావాలంటే మీ పాత ఫోన్ పరిస్థితిపై ఆధారపడి ఉంటుంది.