Ad Code

ఇక నుంచి ట్విటర్ అందరికీ ఉచితం కాదు


న్యూస్, సినిమా అప్‌డేట్స్, ప్రముఖుల గురించి సమాచారంతో పాటు అసలు సోషల్ మీడియాలో ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు చాలా మంది ట్విటర్‌ చూస్తారు. ఐతే ఇప్పటి వరకు అందరికీ ఉచితంగానే ట్విటర్ సర్వీసులు లభించేవి. ఇకపై అలా ఉండదు. ట్విటర్ అందరికీ ఉచితం కాదు. ట్విటర్ ఖాతా కలిగిన వాణిజ్య వినియోగదారులు, ప్రభుత్వ సంస్థలు ఇక నుంచి ఫీజు చెల్లించాల్సిందేనని ట్విటర్ సీఈవో ఎలన్ మస్క్ స్పష్టం చేశారు. అది స్వల్ప మొత్తంలో ఉంటుందని పేర్కొన్నారు. సాధారణ వినియోగదారులు మాత్రం ఏమీ చెల్లించాల్సిన అవసరంలేదు. ఎప్పటిలానే ట్విటర్‌ను ఉచితంగా వాడుకోవచ్చు. ట్విటర్‌ను వాణిజ్య అవసరాల కోసం వినియోగించే సంస్థలు, ప్రభుత్వాలు మాత్రమే చార్జీ చెల్లించాల్సి ఉంటుంది. ఇటీవల ఎలాన్ మస్క్‌తో ట్విటర్‌ను కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. మొత్తం 44 బిలియన్ డాలర్లు వెచ్చించి మస్క్ ట్విటర్ దక్కించుకున్నారు. వాక్ స్వాతంత్య్రానికి మరింత అనువైన వేదికగా ట్విటర్ ను తీర్చిదిద్దుతానని, కొత్త ఫీచర్లను తీసుకొస్తానని ఎలన్ మస్క్ స్పష్టం చేశారు.

Post a Comment

0 Comments

Close Menu