నాసా ప్రయోగించిన ఓరియాన్ చంద్రుడి చుట్టూ 25 రోజులపాటు ప్రదక్షిణలు చేసిన భారత కాలమానం ప్రకారం డిసెంబర్ 11న అర్ధరాత్రి మెక్సికోలోని బజా ద్వీపకల్పంలో పసిఫిక్ సముద్ర తీరంలో దిగింది. దీన్ని నవంబర్ 16న కెన్నడీ స్పేస్ సెంటర్ నుంచి ప్రయోగించడం తెలిసిందే. అయితే ఇది ఆద్యంతం హై రిస్కుతో కూడుకున్న తిరుగు ప్రయాణమని నాసా చెబుతోంది. భూ వాతావరణంలోకి ప్రవేశించాక ఓరియాన్ ఏకంగా గంటకు పాతిక వేల మైళ్ల వేగంతో దూసుకురానుంది. ఈ క్రమంలో ఏర్పడే ఘర్షణ వల్ల ఏకంగా 2,760 డిగ్రీల వేడి కూడా పుట్టుకొస్తుంది. అంటే సూర్యునిపై ఉండే వేడిలో సగం! అంతటి వేగాన్ని, వేడిని తట్టుకుంటూ ఆర్టెమిస్ పసిఫిక్ మహాసముద్రంలో కాలిఫోర్నియాలోని శాన్ డియాగో వద్ద తీరానికి దాదాపు 50 మైళ్ల దూరంలో క్షేమంగా దిగాల్సి ఉంటుంది. ఇది పెను సవాలేనని నాసా సైంటిస్టులంటున్నారు. అందుకే వారిలో ఇప్పట్నుంచే తీవ్ర ఉత్కంఠ నెలకొంది. పైగా ఓరియాన్ ల్యాండింగ్ కోసం నాసా తొలిసారిగా 'స్కిప్ ఎంట్రీ' టెక్నిక్‌ను వాడుతుండటం ఉత్కంఠను మరింత పెంచుతోంది. దీనిప్రకారం నీళ్లలోకి విసిరిన రాయి మాదిరిగా ఓరియాన్ భూ వాతావరణం తాలూకు పై పొరలోకి ఒక్కసారిగా వచ్చి పడుతుంది. తద్వారా దాని అపార వేగం చాలావరకు తగ్గడమే గాక వేడి కూడా అన్నివైపులకూ చెదిరిపోతుందట!. అంతిమంగా ఓరియాన్ వేగాన్ని గంటకు 20 మైళ్లకు తగ్గించాలన్నది లక్ష్యం. ఇందుకోసం 11 భిన్నమైన పారాచూట్లను వాడనున్నారు. అయితే వేగం అదుపులోకి వచ్చేలోపు 2,760 డిగ్రీల వేడిని ఓరియాన్ ఏ మేరకు తట్టుకుంటుందన్నది అత్యంత కీలకం. ''దీనికి ప్రస్తుతానికి మా దగ్గర కూడా స్పష్టమైన సమాధానం లేదు. అందుకే, ఏం జరుగుతుందా అని ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాం'' అని నాసా సైంటిస్టు ఒకరు చెప్పుకొచ్చారు. ఆ అపార వేడిని సమర్థంగా తట్టుకునేందుకు రక్షణ పరికరాల ఉత్పత్తి దిగ్గజం లాక్‌హీడ్-మార్టిన్ తయారు చేసిన అత్యంత మందమైన హీట్ షీల్డ్‌ను ఓరియాన్కు అమర్చారు.
భూమికి చేరిన ఓరియాన్
by Telugu Lo Computer at December 12, 2022
Labels:
nasa
,
science
,
technologe
,
నవంబర్ 16న కెన్నడీ స్పేస్ సెంటర్ నుంచి ప్రయోగించడం జరిగింది
,
భూమికి చేరిన ఓరియాన్
,
మెక్సికోలోని బజా ద్వీపకల్పంలో పసిఫిక్ సముద్ర తీరంలో దిగింది
About Telugu Lo Computer
This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.
Related Posts
Subscribe to:
Post Comments
(
Atom
)
3


No comments:
Post a Comment