ట్విట్టర్ భవితవ్యంపై మరోమారు నీలి నీడలు కమ్ముకున్నాయి. తాను కొనుగోలు చసిన ధరకే ట్విట్టర్‌ను విక్రయిస్తానని ఎలన్ మస్క్ బేరం పెట్టారు. దీనిపై స్పందించడానికి ట్విట్టర్ అధికార ప్రతినిధి అందుబాటులోకి రాలేదు. గత అక్టోబర్‌లో 54.20 డాలర్లకు షేర్ చొప్పున 4400 కోట్ల డాలర్లకే విక్రయిస్తామని ఆదివారం ప్రకటించారు. ట్విట్టర్‌ను టేకోవర్ చేసిన తర్వాత సగం మంది ఉద్యోగులను ఎలన్‌మస్క్ సాగనంపారు. దీర్ఘ కాలికంగా అమల్లో ఉన్నసంస్థ విధానాలను ఎలన్‌మస్క్ తిరగదోడారు. నిషేధానికి గురైన వారి ఖాతాలను పునరుద్ధరించారు. తన వ్యక్తిగత విమానం సమాచారం బయట పెట్టి తమ కుటుంబాన్ని ప్రమాదంలోకి నెట్టారని ఆరోపిస్తూ ఎలన్ మస్క్ ఈ నెల మొదటివారంలో పలువురు జర్నలిస్టుల ఖాతాలను సస్పెండ్ చేశారు. ఏప్రిల్‌లో ట్విట్టర్‌ను కొనుగోలు చేస్తానని తొలుత ప్రతిపాదన చేశారు ఎలన్‌మస్క్. అందుకు ట్విట్టర్ యాజమాన్యం అంగీకరించింది. కానీ స్పామ్ ఖాతాల సంఖ్య తేల్చలేదని పేర్కొంటూ ట్విట్టర్ టేకోవర్ ప్రతిపాదనను ఉపసంహరిస్తున్నట్లు తర్వాత ప్రకటించారు. ఈ అంశం కోర్టు ముందుకెళ్లడంతో తప్పనిసరి పరిస్థితుల్లో గత అక్టోబర్‌లో ట్విట్టర్‌ను టేకోవర్ చేశారు. విద్యుత్ కార్ల తయారీ సంస్థ టెస్లాతోపాటు స్పేస్ ఎక్స్ అనే సంస్థలు నడుపుతున్న మస్క్.. ట్విట్టర్ టేకోవర్ కోసం భారీ ధర పెట్టామని తొలి నుంచి భావిస్తున్నారు.
0 Comments