దేశీయ మార్కెట్లో ఇన్ఫినిక్స్ జీరో అల్ట్రా 5 జీ రేపు విడుదల కానున్నది. ఈ స్మార్ట్ ఫోన్ రెండు నెలల క్రితమే చైనాలో లాంచ్ అయ్యింది. ఈ స్మార్ట్ ఫోన్ భారీ 200MP OIS కెమెరాతో పాటుగా అత్యంత వేగవంతమైన ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ వంటి చాలా ప్రత్యేకతలను కలిగివుంది. ఈ ఫోన్ డిసెంబర్ 20న, అంటే రేపు ఇండియాలో విడుదల అవుతోంది మరియు Flipkart ఈ ఫోన్ కోసం ప్రత్యేకామైన మైక్రో సైట్ పేజ్ ద్వారా టీజింగ్ కూడా చేస్తోంది. కంపెనీ ఇప్పటికే ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ యొక్క కీలకమైన స్పెక్స్ మరియు ఫీచర్లను టీజింగ్ పేజ్ ద్వారా వెల్లడించింది. ఈ ఫీచర్ల ద్వారా చైనాలో విడుదలైన అదే ఫోన్ ను ఇండియాలో కూడా విడుదల చేస్తున్నట్లు అర్ధం చేసుకోవచ్చు. 6.82 ఇంచ్ 3D AMOLED డిస్ప్లేతో ఉంటుంది. ఇది 3D కర్వ్డ్ AMOLED FHD+ డిస్ప్లే మరియు సెంటర్ పంచ్ హోల్ డిజైన్ తో కలిగి ఉంటుంది. అంతేకాదు, గేమింగ్ మరియు స్పోర్ట్స్ కంటెంట్ కోసం ఉపయోగకరమైన ఈ డిస్ప్లే 120Hz రిఫ్రెష్ రేట్ రిఫ్రెష్ రేట్ సపోర్ట్ తో వస్తుంది. ఈ ఫోన్ వేగవంతమైన మీడియాటెక్ Dimensity 920 ఆక్టా కొర్ ప్రాసెసర్ శక్తితో పనిచేస్తుంది. ఈ ఫోన్ లో 8GB ర్యామ్ మరియు 256GB స్టోరేజ్ ను ఉండవచ్చు. ఆప్టిక్స్ పరంగా, జీరో అల్ట్రా 5G వెనుక ట్రిపుల్ కెమెరా సెటప్ ను కలిగివుంది. ఇందులో, OIS సపోర్ట్ కలిగిన 200MP మైన్ కెమెరాకి జతగా అల్ట్రా వైడ్ మరియు డెప్త్ సెన్సార్ ఉన్నాయి. అలాగే, ముందు పంచ్ హోల్ కటౌట్ లో 32 ఎంపి సెల్ఫీ కెమెరా కూడా వుంది. ఈ ఫోన్ టైప్-C ఛార్జింగ్ పోర్ట్ తో 4610 mAh బ్యాటరీని 180W థండర్ ఛార్జ్ సపోర్ట్ తో వస్తుంది మరియు ఈ ఫోన్ కేవలం 12 నిముషాల్లోనే 0 నుండి 100% ఛార్జ్ అవుతుందని కంపెనీ చెబుతోంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 12 ఆధారితంగా XOS 12 సాఫ్ట్ వేర్ పైన నడుస్తుంది.
0 Comments