35 వేలకే ఎలక్ట్రిక్ స్కూటర్ !


బాజ్ బైక్స్ అనే కొత్త స్టార్టప్ కంపెనీ ప్రయాణికుల్ని ఆకర్షించేందుకు చాలా తక్కువ ధరకే ఎలక్ట్రిక్ స్కూటర్‌ని తీసుకొచ్చింది. ఈ ఎలక్ట్రిక్ వెహికల్ మార్కెట్‌లోకి అరంగేట్రం చేసింది. ఇతర సంస్థలకు భిన్నంగా.. చాలా తక్కువ ధరకే ఎలక్ట్రిక్ స్కూటర్‌ని రంగంలోకి దింపింది. ఈ బైక్ పేరు బాజ్ బైక్స్. దీని ధర కేవలం రూ. 35 వేలు. ఇందులో ఉన్న బెస్ట్ ఫీచర్ ఏమిటంటే.. బ్యాటరీ స్వాపింగ్ ఫెసిలిటీ. అంటే.. బ్యాటరీ చార్జ్ అయిపోతే, దాని స్థానంలో మరొక బ్యాటరీ మార్చుకోవచ్చు. ఇందుకోసం పెద్దగా కష్టపడాల్సిన అవసరం ఉండదు. కేవలం 90 సెకన్లలోనే బ్యాటరీని మార్చుకోవచ్చు. ఇలా బ్యాటరీ స్వాపింగ్ స్టేషన్స్‌లో బ్యాటరీ మార్చుకుంటూ.. నాన్‌స్టాప్‌గా ప్రయాణం చేయొచ్చు. ఒక్కసారి చార్జింగ్ పెడితే 100 కిలోమీటర్లు ప్రయాణం చేయొచ్చు. ఈ స్కూటర్ గరిష్ట స్పీడ్.. గంటకు 25 కిలోమీటర్లు. ఇందులో డ్యూయల్ ఫోర్క్ హైడ్రాలిక్ సస్పెన్షన్ సెటప్ ఉంది. వెనుక భాగంలో డ్యూయెల్ షాక్ అబ్జార్బర్స్ ఉన్నాయి. అందువల్ల స్కూటర్ స్మూత్‌గానే వెళ్తుంది. వర్షం, దుమ్ము వంటి వాటికి ఈ స్కూటర్ పాడవకుండా ఉండేందుకు.. వీటికి ఐపీ65 రేటింగ్ అమర్చారు. దీని పొడవు 1624 ఎంఎం, వెడల్పు 680 ఎంఎం, ఎత్తు 1052 ఎంఎం ఉంటుంది. ఈ వెహికల్‌కు ఎలాంటి రిజిస్ట్రేషన్ గానీ, అలాగే డ్రైవింగ్ లైసెన్స్‌ గానీ అవసరం లేదు.

Next Post Previous Post
No Comment
Add Comment
comment url




sr7themes.eu.org