Ad Code

2025లో లేటెస్ట్ ఫీచర్లతో ఐఫోన్ ఎంట్రీ !


ఫ్లెక్సిబుల్ ఓఎల్ఈడీ డిస్‌ప్లేతో పాలు పలు న్యూ ఫీచర్లతో ఐఫోన్ ఫోల్డ్ ఫోల్డబుల్ ఫోన్ మార్కెట్‌లో ప్రకంపనలు సృష్టించనుంది. ప్రస్తుతం ఫోల్డబుల్ మార్కెట్‌లో శాంసంగ్ దీటుగా రాణిస్తుండగా మొటొరొలా సైతం పలు ఫోల్డబుల్ ఫోన్లను లాంఛ్ చేయగా 2023లో రేజర్‌ను ప్రవేశపెట్టనుంది. మరోవైపు గూగుల్ పిక్సెల్ సైతం త్వరలోనే మార్కెట్‌లో ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌ను ప్రవేశపెడుతోంది. ఇక యాపిల్ ఐఫోన్ ఫోల్డ్ 2025లో స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి వస్తుందని టెక్ నిపుణులు అంచనా వేస్తున్నారు. శాంసంగ్ గెలాక్సీ జడ్ ఫ్లిప్‌ను పోలిన డిజైన్‌పై యాపిల్ కసరత్తు సాగిస్తోందని సమాచారం. యాపిల్ ప్రస్తుతం డివైజ్ మన్నికను పరీక్షిస్తోంది. ఫోల్డింగ్ ఐఫోన్‌కు ఓఎల్ఈడీ వాడాలా లేక మైక్రోలెడ్ మెటీరియల్‌ను ఉపయోగించాలా అని యాపిల్ యోచిస్తోందని ఎకనమిక్ డైలీ పేర్కొంది. ఫోల్డబుల్ ఫోన్లు ఊపందుకున్నా ఈ మార్కెట్‌లో ప్రస్తుతం శాంసంగ్‌, మొటొరొలా, ఎల్‌జీ, హువై వంటి కంపెనీలు కార్యకలాపాలు సాగిస్తున్నాయి. యాపిల్ ఫోల్డ్ కూడా ఈ సెగ్మెంట్‌లో ఎంటరైతే పోటీ నెలకొనడం ద్వారా ఫోల్డబుల్ ఫోన్ మార్కెట్‌లో ఎలాంటి మార్పులు చోటుచేసుకుంటాయనేది ఆసక్తికరంగా మారింది.

Post a Comment

0 Comments

Close Menu