Ad Code

ఓపెన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాట్ బాట్


ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో ప్రత్యేకత కలిగిన ప్రఖ్యాత పరిశోధనా సంస్థ OpenAI, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి సాధనాలను రూపొందించడంలో దిట్ట. ఇటీవల ఈ సంస్థ ChatGPT అని పిలువబడే AI- పవర్డ్ చాట్ బాట్ ను విడుదల చేసింది. అంతేకాదు, ఈ చాట్ బాట్ ను  పరీక్షించడాని పబ్లిక్ యూజర్లను అనుమతించింది. ఈ చాట్ బాట్ వినియోగదారులతో "సంభాషణ ధోరణిలో" మాట్లాడటానికి చక్కగా శిక్షణ పొందిందని, తద్వారా ఇది చాలా మందికి అందుబాటులో ఉంటుందని కంపెనీ తెలిపింది. ChatGPT కేవలం సెకన్ల వ్యవధిలో యాప్స్ మరియు వెబ్ సైట్ల కోసం కోడ్ ను వ్రాయడంలో సహాయపడే సాధనంగా ఉపయోగపడుతుందని కూడా చెబుతుంది.  చాలా మంది వినియోగదారులు చాట్ బాట్ ను  పరీక్షించారు.  ఇది సంక్లిష్టమైన కోడింగ్-సంబంధిత సమస్యలను కూడా రెప్పపాటులో పరిష్కరించగలదని తెలుసుకున్నారు. తమ అనుభవాలను ట్విట్టర్లో పంచుకున్నారు. ChatGPT అనేది, OpenAI చే అభివృద్ధి చేయబడిన నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ మోడల్. ఇది ట్రాన్స్ఫార్మర్-ఆధారిత మోడల్, ఇది సంభాషణ డేటా యొక్క లార్జ్ కార్పస్ పై శిక్షణ పొందింది. ఇది వినియోగదారు ఇన్ పుట్ కు మనుషుల-వంటి ప్రతిస్పందనలను అందించడానికి రూపొందించబడింది. ChatGPT తో ఉపయోగించడానికి, వినియోగదారులు తప్పనిసరిగా OpenAI వెబ్ సైట్ కి వెళ్లి అకౌంట్ ను క్రియేట్ చెయ్యాలి. మంచి విషయం ప్రస్తుతానికి ఈ చాట్ బాట్ ఉచితంగా అందుబాటులో వుంది. ఎందుకంటే పూర్తి స్థాయి సామర్థ్యాలను నిర్ధారించడానికి వీలైనంత ఎక్కువ మంది వినియోగదారులు దీనిని పరీక్షించాలని కంపెనీ కోరుకుంటుంది. 

Post a Comment

0 Comments

Close Menu