Ad Code

డేటా ఇచ్చేందుకు ట్విట్టర్ ఓకే !


ఎలాన్ మస్క్ ట్విట్టర్ యాజమాన్యంతో చర్చలు జరిపిన సంస్థను 44 బిలియన్ డార్లకు కొనుగోలు చేసేందుకు ఓకే చెప్పాడు. కానీ, అప్పటి నుంచి తనకు ట్విట్టర్ డేటా ఇవ్వాలని, ఎన్ని ఫేక్ ఖాతాలు ఉన్నాయి? ఎన్ని బాట్స్ ఉన్నాయి? అన్న విషయాలు తనకు తెలియాలని కోరారు. ముందుగా ఇందుకు నిరాకరించిన ట్విట్టర్ తాజాగా తమ డాటా ఇచ్చేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే తనకు కావాల్సిన డేటా ఇవ్వకుంటే 44 బిలియన్ డాలర్ల డీల్‌ను నిలిపివేస్తానంటూ మస్క్ బెదిరించారు. ఆ తర్వాత ట్విట్టర్ తన డేటాను షేర్ చేసేందుకు సిద్ధమైంది. అంతేకాకుండా తమ అంతర్గత సమాచారానికి సంబంధించిన ఫైర్‌హౌస్ యాక్సెస్‌ను మస్క్ ఇవ్వాలని ట్విట్టర్ బోర్డు నిర్ణయించుకుంది.

Post a Comment

0 Comments

Close Menu