హర్యానాలోని అమిటీ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు 3డీ ప్రింటింగ్ టెక్నాలజీతో ఎన్95 మాస్కును తయారు చేశారు. నాలుగు పొరలతో కూడిన ఈ మాస్కును తిరిగి వినియోగించవచ్చు. ఉతకవచ్చు. దుర్వాసన రాదు. సూక్ష్మజీవి రహితమైనది. నాన్ అల్లర్జిక్. బయటి పొరను సిలికాన్‌తో తయారు చేశారు. ఇది ఐదేళ్ల వరకు పాడవకుండా ఉంటుంది. అమెరికాలోని నెబ్రాస్కా యూనివర్సిటీతో కలిసి ఈ మాస్కును తయారు చేశారు.
0 Comments