Ad Code

సామ్‌సంగ్‌కు రూ. 75 కోట్ల జరిమానా !


ఆస్ట్రేలియాలో 2016 మార్చి నెల నుంచి 2018 అక్టోబర్ మధ్య  సామ్‌సంగ్‌ ఎస్‌7, ఎస్‌8 సిరీస్‌కు చెందిన 31 లక్షల స్మార్ట్‌ఫోన్‌లను విక్రయించింది. ఈ నేపథ్యంలో ఈ ఫోన్‌ల ప్రకటనలో భాగంగా సామ్‌సంగ్‌ వాటర్‌ ప్రూఫ్‌ ఫోన్‌లు అంటూ ప్రచారం చేసుకుంది. అయితే తీరా మొబైల్‌ ఫోన్‌లను ఉపయోగించిన తర్వాత నీళ్లలో తడిచిన తమ ఫోన్‌లు పనిచేయడం లేదంటూ వందలాది మంది సామ్‌సంగ్‌ యూజర్లు ఫిర్యాదు చేయడం ప్రారంభించారు. ఈ నేపథ్యంలోనే 2019లో పలు కేసులు నమోదయ్యాయి. దాదాపు రెండేళ్ల పాటు విచారణ జరిగన తర్వాత తాజాగా ఆస్ట్రేలియా కోర్టు తీర్పునిచ్చింది. దీంతో సంబంధిత స్మార్ట్‌ఫోన్‌లను ఉపయోగించిన యూజర్లు తమను సంప్రదించాలని సామ్‌సంగ్‌ ఓ ప్రకటన విడుదల చేసింది. వాటర్‌ రెసిస్టెంట్స్‌ విషయంలో యూజర్లను సామ్‌సంగ్‌ తప్పుదోవ పట్టించదన్న కారణంతో ఆస్ట్రేలియన్‌ కాంపిటీషన్‌ అండ్‌ కన్జ్యూమర్‌ కమిషన్‌ సామ్‌సంగ్‌పై దావా వేసింది. ఈ నేపథ్యంలో కోర్టు యూజర్లను తప్పుదోవ పట్టించారన్న కారణంతో ఏకంగా రూ. 75 కోట్ల జరిమానా విధించింది.

Post a Comment

0 Comments

Close Menu