దేశీయ మార్కెట్లోకి హెచ్‌పీ సరికొత్త ల్యాప్‌టాప్ మోడల్స్‌ను విడుదల చేసింది. 2022 మోడల్ HP Omen 16, Omen 17 ల్యాప్‌టాప్‌లతో పాటుగా Victus 15, మరియు Victus 16 నోట్‌బుక్ డివైజ్‌లను విడుదల చేసింది. ఈ డివైజ్‌ల ప్రారంభ ధర రూ.67,999 గా ఉన్నాయి. అదేవిధంగా ఈ డివైజ్‌లు Intel Core 12 and AMD Ryzen ప్రాసెసర్‌లను కలిగి ఉన్నాయి. ఈ డివైజ్‌లు అద్భుతమైన గేమింగ్ పెర్ఫార్మెన్స్‌ను కనబరుస్తాయి. గేమింగ్ సమయంలో ఏర్పడే వేడిని తగ్గిస్తాయి. HP Omen 16 ల్యాప్‌టాప్‌లో ఎక్కువ మంది గేమర్‌లను ఆకర్షించే స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. ఈ ల్యాప్‌టాప్‌లు 16:9 యాస్పెక్ట్ రేషియోతో 16.1-అంగుళాల క్వాడ్ HD డిస్‌ప్లే రిజల్యూషన్‌తో కూడిన డిస్‌ప్లేతో వస్తాయి. ఈ డివైజ్ లు 165Hz రిఫ్రెష్ రేట్ డిస్‌ప్లేతో వస్తుంది. ఈ డివైజ్‌లు 32జీబీ ర్యామ్, 1టీబీ వరకు ఎస్ఎస్‌డీ ని కలిగి ఉన్నాయి. ఇది 720 పిక్సెల్ క్వాలిటీ తో వెబ్‌క్యామ్ కలిగి ఉంది. దీనికి 150వాట్ స్మార్ట్ పవర్ అడాప్టర్ ఇస్తున్నారు. ఈ ల్యాప్‌టాప్ బ్యాటరీ లైఫ్ 9 గంటల పాటు పని చేయడానికి వీలు కల్పిస్తుంది. గేమింగ్ సమయంలో హీట్‌ను తగ్గించేందుకు ఈ ల్యాప్‌టాప్స్ హీట్ పైప్స్‌ను కలిగి ఉన్నాయి. రెండు మెమోరీ స్లాట్స్ అందిస్తున్నారు. ఇది 5.2కాంబో బ్లూటూత్ వర్శన్ కలిగి ఉంది. అదనపు డిస్‌ప్లే ఫీచర్‌లో ఐసేఫ్ ఫ్లికర్ ప్రొటెక్షన్ కూడా ఉంది. ఈ ల్యాప్‌టాప్ మైకా సిల్వర్ కలర్‌లో అందుబాటులో ఉంది. HP Omen 17 ల్యాప్‌టాప్‌లు 17.3-అంగుళాల సాఫ్టర్ ఎడ్జ్ హెచ్‌డీ డిస్‌ప్లేతో వస్తాయి. ఇది ఇంటెల్ Core i5 లేదా i7 ప్రాసెసర్‌ను కలిగి ఉంది. ఈ గేమింగ్ ల్యాప్‌టాప్‌లో ఎక్కువ మంది గేమర్‌లను ఆకర్షించే స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. ఈ ల్యాప్‌టాప్ అత్యుత్తమ బ్యాటరీ లైఫ్ కలిగి ఉంది. గేమింగ్ సమయంలో హీట్‌ను తగ్గించేందుకు ఈ ల్యాప్‌టాప్స్ హీట్ పైప్స్‌ను కలిగి ఉన్నాయి. ఇది 4.2 బ్లూటూత్ వర్శన్ కలిగి ఉంది. HP Victus 15 నోట్‌బుక్ 15.6-అంగుళాల ఎడ్జ్ టూ ఎడ్జ్ హెచ్‌డీ రిజల్యూషన్‌తో కూడిన డిస్‌ప్లేతో వస్తాయి. ఇది ఇంటెల్ Core i7 ప్రాసెసర్‌ను కలిగి ఉంది. ఇక Victus 16 విషయానికి వస్తే 16.1-అంగుళాల హెచ్‌డీ రిజల్యూషన్‌తో కూడిన డిస్‌ప్లేతో వస్తాయి. ఇవి 144Hz స్క్రీన్ రిఫ్రెష్ రేటు కలిగి ఉంటాయి. ఇవి 32 జీబీ ర్యామ్ కలిగి ఉన్నాయి. దీనికి 200వాట్ స్మార్ట్ పవర్ అడాప్టర్ ఇస్తున్నారు. ఈ ల్యాప్‌టాప్ బ్యాటరీ లైఫ్ 08.45 గంటల పాటు పని చేయడానికి వీలు కల్పిస్తుంది. ఇది 720 పిక్సెల్ క్వాలిటీ గల వెబ్ క్యామ్ కలిగి ఉంది. HP Omen 16 ప్రారంభ ధరను రూ.1,09,999 గా నిర్ణయించారు. అదేవిధంగా HP Omen 17 ప్రారంభ ధరను రూ.1,99,999 గా నిర్ణయించారు. ఇక విక్టస్ డివైజ్‌ల విషయానికి వస్తే.. మన దేశంలో HP Victus 15 ప్రారంభ ధరను రూ.67,999 గా నిర్ణయించారు. అదేవిధంగా HP Victus 16 ప్రారంభ ధరను రూ.84,999 గా నిర్ణయించారు. వీటితో పాటుగా హెచ్‌పీ భారత మార్కెట్లో Omen 45L, 40L మరియు 25L డెస్క్‌టాప్‌లను కూడా విడుదల చేసింది. ఇవి ప్రారంభ ధర రూ. 1,49,999గా ఉన్నాయి.
0 Comments