పబ్లిక్, ఎంటర్‌ప్రైజెస్‌కు 5G సేవలను అందించడానికి స్పెక్ట్రమ్ వేలాన్ని విజయవంతమైన బిడ్డర్‌లకు కేటాయించే టెలికమ్యూనికేషన్స్ శాఖ ప్రతిపాదనను కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. దీని ప్రకారం 20 సంవత్సరాల చెల్లుబాటు వ్యవధితో మొత్తం 72097.85 MHz స్పెక్ట్రమ్ జూలై 2022 చివరి నాటికి వేలం చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ 5G సేవలు అందుబాటులోకి వస్తే ప్రజలకు మంచి జరుగుతుందని.. అలాగే అభివృద్ధి కూడా పెద్ద ఎత్తున జరిగే అవకాశం ఉన్నట్లు నిపుణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
0 Comments