యూజర్లు తమ మొబైల్స్‌లో ఫాస్ట్ ఛార్జింగ్ విధానాల కోసం వెతుకుతున్నారు. ఈ క్రమంలో యూజర్ల అవసరానికి అనుగుణంగా పలు కంపెనీలు ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీకి సంబంధించి కొత్త మోడల్స్‌ను తీసుకు వచ్చేందుకు ప్రయత్నాలు అయితే ప్రారంభించాయి. తాజాగా Infinix కంపెనీ అత్యధికంగా 180వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ కలిగిన మొబైల్‌ను మార్కెట్లో లాంచ్ చేయాలని సన్నాహాలు చేస్తోనట్లు ఇటీవల అందుకు సంబంధించిన విషయాన్ని ఫేస్‌బుక్‌లో వెల్లడించడం విశేషం. Infinix సంస్థ Facebook వేదికగా ఒక చిన్న క్లిప్ ద్వారా కొత్త ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీకి సంబంధించిన దృశ్యాన్ని విడుదల చేసింది. 180W ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ రేటింగ్ కలిగిన, దీనిని "థండర్ ఛార్జ్ సిస్టమ్" అని పేరు పెట్టింది. Infinix సాధించిన వేగవంతమైన ఛార్జింగ్ టెక్నాలజీ అని అందులో పేర్కొంది. OnePlus మరియు Realme వంటి ఇతర ఒరిజినల్ ఎక్విప్‌మెంట్ తయారీదారులు ఇప్పటికే తమ స్మార్ట్‌ఫోన్‌లను 150W వరకు ఛార్జింగ్‌కు సపోర్ట్‌తో షిప్పింగ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా ఇన్ఫినిక్స్ కూడా ఫాస్ట్ ఛార్జింగ్ కు సంబంధించి ఈ అప్‌డేట్ చేయడం విశేషం. మరోవైపు, ఇప్పటికే Vivo సబ్-బ్రాండ్ iQoo కూడా 200W ఛార్జింగ్ టెక్నాలజీ తో iQoo 10 ప్రోని ప్రారంభించేందుకు సిద్ధమవుతోందని పలు రూమర్స్ వచ్చాయి. ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీకి సంబంధించి ఆ కంపెనీ సహ వ్యవస్థాపకుడు బెంజమిన్ జియాంగ్ 10-సెకన్ల చిన్న వీడియోను పంచుకున్నారు, దీనిలో స్మార్ట్‌ఫోన్ ఫాస్ట్ ఛార్జింగ్‌తో కనిపిస్తుంది. జియాంగ్ మాట్లాడుతూ, "థండర్ ఛార్జ్" అనేది కంపెనీ ఇప్పటివరకు చేసిన అత్యంత వేగవంతమైన ఛార్జ్ అని చెప్పారు. గత సంవత్సరం రూపొందించిన Infinix కాన్సెప్ట్ ఫోన్ 2021లో గరిష్టంగా 160W ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది మరియు కేవలం 10 నిమిషాల్లో 4,000mAh బ్యాటరీని పూర్తిగా ఛార్జ్ చేస్తుందని పేర్కొంది. కాగా, ఇప్పటికే OnePlus మరియు Realme వంటి ఇతర ఒరిజినల్ ఎక్విప్‌మెంట్ తయారీదారులు ఇప్పటికే తమ స్మార్ట్‌ఫోన్‌లను 150W వరకు ఛార్జింగ్‌కు సపోర్ట్‌తో షిప్పింగ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా ఇన్ఫినిక్స్ కూడా ఫాస్ట్ ఛార్జింగ్ కు సంబంధించి ఈ అప్‌డేట్ చేయడం విశేషం.
0 Comments