పెళ్లయిన మహిళలు ఎక్కువగా గూగుల్ లో ఎలాంటి వివరాల కోసం సెర్చ్ చేస్తున్నారనే అంశంపై తాజగా ఓ అధ్యాయనం నిర్వహించారు. దీంతో అనేక ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి. గూగుల్ డేటా ప్రకారం వివాహిత మహిళలు తమ భర్తకు ఏది ఇష్టమో తెలుసుకునే మార్గాలను గూగులో వెతుకుతున్నారు. భర్తలకు కావాల్సినవి మరియు వారు ఇష్టపడేవి, ఇష్టపడనివి తెలుసుకోవాలనే కోరికతో ఇలాంటి వివరాలను సెర్చ్ చేస్తున్నారు. పెళ్లయిన ఆడవాళ్లు తమ భర్త మనసు గెలుచుకుని వాళ్లను ఎలా సంతోషపెట్టాలి అనే ప్రశ్నను కూడా అనేక సార్లు గూగుల్‌లో చాలాసార్లు వెతికినట్లు తేలింది. ఇంకా పెళ్లయిన మహిళలు తమ భర్తను తమ పిడికిలిలో ఎలా ఉంచుకోవాలి? అందుకు మార్గం గురించి గూగుల్‌లో సెర్చ్ చేస్తున్నట్లు కూడా అధ్యాయనంలో తేలింది. ఇంకా బిడ్డను కనడానికి సరైన సమయం ఎప్పుడు అని కూడా గూగుల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నట్లు అధ్యాయనం వెల్లడించింది. పెళ్లయిన తర్వాత కొత్త ఇంట్లో ఎలా ప్రవర్తించాలి ? ఆ కుటుంబంలో ఎలా ఉండాలి ? అత్తగారితో ఎలా సంతోషంగా ఉండాలి ? అని పెళ్లయిన మహిళలు గూగుల్‌లో సెర్చ్ చేస్తున్నట్లు తెలిసింది. అంతేకాకుండా కుటుంబ బాధ్యతలను ఎలా చూసుకోవాలి ? పెళ్లయ్యాక సొంతంగా వ్యాపారం ఎలా సాగించాలి ? కుటుంబ వ్యాపారాన్ని ఎలా నడిపించాలో తెలుసుకోవడానికి కూడా గూగుల్ నే ఆశ్రయిస్తున్నట్లు అధ్యాయనం వెల్లడించింది..
0 Comments