షావోమీ ఆగస్ట్ 15న స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ముందు అదిరే ఆఫర్లు, డిస్కౌంట్లను అందిస్తోంది. వివిధ మోడల్స్ Xiaomi, Redmi స్మార్ట్ఫోన్లపై సేల్ ఆఫర్లను ప్రకటించింది. ఆసక్తిగల కస్టమర్లు ఈ ఆఫర్లను Amazon వెబ్సైట్, Xiaomi ఇండియా ఛానెల్‌లలో ఆగస్టు 6 నుంచి ఆగస్టు 11 వరకు పొందవచ్చు. ముఖ్యంగా, ఎర్లీ బర్డ్ ఆఫర్లు లైవ్‌లో ఉన్నాయి. షావోమీ వెబ్సైట్, తన భాగస్వామి ఛానెల్లో సేల్ అందుబాటులో ఉంటాయి. ఆగస్టు 15 ఇండిపెండెన్స్ సేల్ ఈవెంట్ సందర్భంగా, కస్టమర్లు ఫ్లాగ్షిప్ Xiaomi 12 Pro తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు. భారత మార్కెట్లో మొదటిసారిగా రూ. 49,999 కన్నా తక్కువ ధరకు Xiaomi స్మార్ట్ ఫోన్ అందుబాటులో ఉంటుంది. SBI క్రెడిట్ కార్డ్ ద్వారా రూ. 2,000 ఇన్స్టంట్ డిస్కౌంట్‌తో సహా రూ. 13,000 వరకు “additional discount”ను కస్టమర్లు పొందవచ్చని Xiaomi వెల్లడించింది. షియోమీ వెబ్సైట్, Amazonలో Xiaomi 12 Pro స్మార్ట్ ఫోన్ ఇప్పటికీ రూ. 62,999 వద్ద అందుబాటులో ఉంది. అమెజాన్‌లో వినియోగదారులు రూ. 5వేల విలువైన కూపన్‌ను ఉపయోగించవచ్చు. అన్ని బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌లతో కలిపి రూ. 6,000 డిస్కౌంట్ పొందవచ్చు. అంతేకాకుండా, SBI క్రెడిట్ కార్డ్ యూజర్లు అదనంగా రూ. 2,000 (రూ. 5,000 + రూ. 6,000 + రూ. 2,000) డిస్కౌంట్ పొందవచ్చు. ప్రభావవంతంగా ఫోన్‌ను రూ. 49,999 వద్ద అందుబాటులో ఉంటుంది. రూ.39,999 ధర ట్యాగ్‌తో వచ్చే స్నాప్‌డ్రాగన్ 888-పవర్డ్ షియోమీ 11T Pro రూ.29,999కి అందుబాటులో ఉంటుంది. Snapdragon 778G-ఆధారిత Xiaomi 11 Lite NE కూడా Xiaomi స్వాతంత్ర్య దినోత్సవ సేల్ సందర్భంగా రూ. 9,000 వరకు డిస్కౌంట్ అందిస్తుంది. అది కూడా రూ.18,999లకే అందుబాటులో ఉంటుంది. ఈ ఫోన్‌కు మూడేళ్ల ఆండ్రాయిడ్ అప్డేట్లు అందించనున్నట్టు కంపెనీ వెల్లడించింది. ఇప్పటి వరకు ప్రవేశపెట్టిన అత్యంత శక్తివంతమైన స్మార్ట్ఫోన్లలో Redmi Note”, Redmi Note 11 Pro+ 5G ఉన్నాయి. దీని ధర రూ. 24,999కి బదులుగా రూ. 19,999కి అందుబాటులో ఉంటుంది. Qualcomm Snapdragon 695 SoC, 120Hz రిఫ్రెష్ రేట్‌తో Full-HD+ sAMOLED డిస్ప్లే, 108-MP కెమెరాతో వస్తుంది. మీరు బడ్జెట్ ఆప్షన్ కోసం చూస్తుంటే.. Redmi 10A Sport ధర రూ. 13,999కి బదులుగా రూ. 10,999కి సొంతం చేసుకోవచ్చు.
షావోమీ ఇండిపెండెన్స్ డే సేల్ !
by Telugu Lo Computer at August 05, 2022
Labels:
science
,
smart phones
,
technologe
,
Xiaomi
,
షావోమీ ఇండిపెండెన్స్ డే సేల్
About Telugu Lo Computer
This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.
Related Posts
Subscribe to:
Post Comments
(
Atom
)
3


No comments:
Post a Comment