ఐఫోన్ 14 విడుదల కాస్త ఆలస్యం అయ్యే అవకాశాలు ఉన్నాయని ఇప్పటికే పలు నివేదికలు చెబుతుండగా, తాజాగా మ్యాక్స్ విన్‌బ్యాక్ అనే మరో నివేదిక ఆసక్తికర విషయాలను వెల్లడించింది. రాబోయే యాపిల్ ఉత్పత్తులు అంచనా గడువు కంటే ముందే విడుదలయ్యే అవకాశం ఉందని ఆ నివేదిక పేర్కొంది. ఆపిల్ వాచ్ సిరీస్ 8 మరియు 10వ జెనరేషన్ ఐప్యాడ్‌తో పాటు ఐఫోన్14 సిరీస్ స్మార్ట్ఫోన్లను సెప్టెంబర్ 6వ తేదీన ఆపిల్ విడుదల చేయనున్నట్లు పేర్కొంది. చైనా-తైవాన్-యుఎస్ మధ్య ఉద్రిక్తత కారణంగా ఐఫోన్ సిరీస్ మొబైల్స్ లాంచ్ ఆలస్యం కావచ్చని కొన్ని నివేదికలు సూచిస్తున్నాయి. మరోవైపు, భారత్‌లో ఐఫోన్14, ఐఫోన్14 మాక్స్ వంటి వివిధ ఆపిల్ ఐఫోన్ 14 మోడల్‌ల స్థిరమైన లభ్యతను నిర్ధారించడానికి ఆ కంపెనీ దేశీయంగా ఉత్పత్తిని పెంచాలని యోచిస్తోందని కూడా నివేదికలో చెప్పబడింది. ఆపిల్ ఒకవేళ అధికారికంగా ఐఫోన్ 14 సిరీస్‌ను సెప్టెంబర్ 6వ తేదీన లాంచ్ చేస్తే, అధికారికంగా ప్రారంభించిన 10 రోజుల తర్వాత స్మార్ట్ఫోన్లు సెప్టెంబర్ 16 నుండి భారతదేశంలో మరియు ప్రపంచవ్యాప్తంగా విక్రయించబడతాయని తెలుస్తోంది. iPhone 14 సిరీస్‌తో పాటు, Apple Watch Series 8 మరియు 10th Gen Apple iPad వంటి పరికరాలు కూడా కొనుగోలుకు అందుబాటులో ఉంటాయి.
సెప్టెంబర్ 6న ఐఫోన్ 14 సిరీస్ విడుదల ?
by Telugu Lo Computer at August 08, 2022
Labels:
apple
,
science
,
technologe
,
ఆపిల్ వాచ్ సిరీస్ 8 మరియు 10వ జెనరేషన్ ఐప్యాడ్‌తో పాటు ఐఫోన్14 సిరీస్
,
సెప్టెంబర్ 6న ఐఫోన్ 14 సిరీస్ విడుదల ?
About Telugu Lo Computer
This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.
Related Posts
Subscribe to:
Post Comments
(
Atom
)
3


No comments:
Post a Comment