ఆగస్టు 6 -10 వరకు అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ !


అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ ప్రారంభించనుంది. ఇప్పటికే ప్రైమ్ డే సేల్  ముగియగా., వార్షిక గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్‌ను తీసుకొస్తోంది. ఈ స్పెషల్ సేల్ ఐదు రోజుల పాటు అందుబాటులో ఉంటుంది. ఈ నెలలో స్వాతంత్ర్య దినోత్సవానికి ముందే అమెజాన్ ఈ స్పెషల్ సేల్ ప్రారంభం కానుంది. ఆగస్టు 6 నుంచి ఆగస్ట్ 10 వరకు కొనసాగుతుంది. అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ సందర్భంగా.. అమెజాన్ ఇండియా SBI బ్యాంక్ కార్డ్‌లపై 10 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ అందించనుంది. ఎంపిక చేసిన ప్రొడక్టులపై కొన్ని సాధారణ డిస్కౌంట్లను అందిస్తోంది. అదే సమయంలో 8:00PM నుంచి అర్ధరాత్రి వరకు పరిమిత వ్యవధి డీల్‌లు అందించనుంది. స్మార్ట్‌ఫోన్‌లు, యాక్సెసరీలపై 40 శాతం వరకు డిస్కౌంట్ అందించనుంది. ఏయే స్మార్ట్ ఫోన్లపై భారీ డిస్కౌంట్లను అందిస్తుందో అమెజాన్ వెల్లడించలేదు. దీనికి సంబంధించి మరికొద్ది రోజుల్లో వివరాలను అమెజాన్ రివీల్ చేసే అవకాశం ఉంది. అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ సమయంలో తగ్గింపు ధరలకు అనేక గిఫ్ట్‌లు కొనుగోలు చేయవచ్చు. నో కాస్ట్ ఇఎంఐ ఆప్షన్లు, అలాగే ఫోన్‌లు, ఇతర ప్రొడక్టులపై కూడా ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లు అందుబాటులో ఉంటాయి. స్మార్ట్ ఫోన్‌లతో పాటు, ల్యాప్‌టాప్‌లపై కూడా అమెజాన్ డీల్స్, ఆఫర్‌లను అందిస్తుంది. హెడ్‌ఫోన్‌లపై 75 శాతం వరకు, ల్యాప్‌టాప్‌లపై 40 శాతం వరకు, టాబ్లెట్‌లపై 45 శాతం వరకు డిస్కౌంట్ అందించనుంది.

Next Post Previous Post
No Comment
Add Comment
comment url




sr7themes.eu.org