వెబ్‌సైట్ పెట్టుకొనేందుకు ప్రస్తుతం ప్రభుత్వ అనుమతి
అవసరం లేదు. అయితే వెబ్‌సైట్‌ను పెట్టుకోవాలంటే ముందుగా- సైట్‌ను
పెట్టుకొనేందుకు అవసరమైన స్పేస్ (కనీసం 100ఎంబి నుండి ఆ పైన)ను స్పేస్
ప్రొవైడర్స్ వద్ద కొనుగోలు చేయాల్సి వుంటుంది. దాంతోపాటు డైమైన్
రిజిస్ట్రేషన్ కూడా వారి వద్దనే చేయించుకోవచ్చు. అంటే మీరు ఏ పేరుతో
వెబ్‌సైట్‌ను నిర్మించాలనుకొంటున్నారో దాన్నే డైమైన్ అంటారు. ఈ రెండింటికీ
ఒక్కొక్కరు ఒక్కో రకమైన రేటును తీసుకుంటుంటారు. మీరు ఎవనైనా స్పేస్
ప్రొవైడర్‌ను కలిస్తే దానికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలుస్తాయి. ఆ
తర్వాత మీరు ఆ సైట్‌లో వుంచే కంటెంట్‌ను బట్టి సైట్ డిజైన్‌కు అదనంగా
ఖర్చవుతుంది. పూర్తిగా డిజైన్ అయిన సైట్‌ను గూగుల్ యాడ్‌సెన్స్
అప్రూవల్‌కు పంపాలి. వారు మీ సైట్‌ను ఓకే చేస్తే, ఆ సైట్‌కు సంబంధించిన
యాడ్స్‌ను వారు ప్రొవైడ్ చేస్తారు. దానికి సంబంధించిన వివరాలు కూడా మీకు
మెయిల్ చేస్తారు. అయితే ఆ వెబ్‌సైట్ ఇంగ్లీష్‌లో వుంటేనే వారు
అంగీకరిస్తారు.