Ad Code

only in English Rikagnaijesan Technology -ఇప్పటి వరకు ఆంగ్లంలో మాత్రమే

ఇప్పటి వరకు ఆంగ్లంలో మాత్రమే స్పీచ్‌ రికగ్నైజేషన్‌ టెక్నాలజీ అందుబాటులో ఉంది. అయితే ఈ టెక్నాలజీని హిందీలోనూ అందుబాటులోకి ఐబిఎమ్‌ సంస్థ అందుబాటులోకి తీసుకువచ్చింది. ప్రత్యేకించి అంగవికలురైన వారికి ఈ స్పీచ్‌రికగ్నైజేషన్‌ సాఫ్ట్‌వేర్‌ ద్వారా కంప్యూటర్‌పై వివిధ రకాలైనటువంటి అప్లికేషన్స్‌ను సులభంగా ఆపరేట్‌ చేయటం సులభమౌతుందని తెలుపుతోంది. ఈ స్పీచ్‌ రికగ్నైజేషన్‌ సాఫ్ట్‌వేర్‌ అభివృద్ధి కోసం సెంటర్‌ ఫర్‌ డెవలప్‌మెంట్‌ ఆఫ్‌ అడ్వాన్స్‌డ్‌ కంప్యూటరింగ్‌ (సి-డాక్‌)తో ఒప్పందం కుదర్చుకొన్నట్లు ఐబిఎమ్‌ ఇండియా సాఫ్ట్‌వేర్‌ ల్యాబ్‌ వెల్లడించింది.

ఇందులో ప్రత్యేకించి స్పష్టమైన ఉచ్ఛారణే గాక, అస్పష్టంగా ఉన్నటువంటి మాటలను సైతం ఇది అర్థం చేసుకోగలదని వెల్లడిస్తున్నారు. ఈ టెక్నాలజీ ద్వారా 75వేలకు పైగా హిందీ పదాలను 90 నుంచి 95 శాతం వరకు స్పష్టంగా అర్థం చేసుకోవచ్చని తెలిపారు. ఇది మాటలను అక్షరాల రూపంలో మార్చటమే గాక, వాయిస్‌ ఆధారంగా పనిచేసే ఏటిఎమ్‌లు, కార్‌ నావిగేషన్‌ సిస్టమ్స్‌, బ్యాంకింగ్‌, టెలికామ్‌, రైల్వేలు, ఎయిర్‌లైన్స్‌ తదితర విభాగాల్లోనూ ఈ స్పీచ్‌ రికగ్నైజేషన్‌ టెక్నాలజీ వినియోగించవచ్చునని ఐబిఎమ్‌ ఇండియా రీసెర్చి ల్యాబరెటరీ డైరెక్టర్‌ డేనియల్‌ డేస్‌ తెలిపారు. ఈ టెక్నాలజీ ద్వారా హిందీ తర్జుమా మరింత సులభతరం అవనున్నదని సి-డాక్‌ సైతం అంటోంది. దీని సాయంతో అంధులు సులభంగా ఇంటర్నెట్‌ మీద తమ పనులు చేసుకోవచ్చు. ఇప్పటి వరకు ప్రాంతీయ భాషల్లో పూర్తిస్థాయిలో పనిచేసే వాయిస్‌ రికగ్నైజేషన్‌ సాఫ్ట్‌వేర్‌గా దీన్ని సి-డాక్‌ తెలుపుతోంది. దీన్ని ఉపయోగించి పనులను చాలా సులభంగా చేయవచ్చునంటోంది ఐబిఎమ్‌.

Post a Comment

0 Comments

Close Menu