Ad Code

Software company employee (ఆన్‌లైన్‌ గేమింగ్‌ మొదలైంది)

శశాంక్‌ ప్రముఖ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో ఉద్యోగి. 23 సంవత్సరాలకే అయిదంకెల జీతం అందుకుంటున్నాడు.ఈ క్రమంలో మిత్రులతో సరదా ఆన్‌లైన్‌ గేమింగ్‌ మొదలైంది. కొన్ని వెబ్‌సైట్లు ఆన్‌లైన్‌గేమ్స్‌లో విజేత అయితే భారీగా బహుమతులు ముట్టజెప్పుతుండటంతో దీన్ని ఛాలెంజ్‌గా తీసుకొని ఆడటం మెదలుపెట్టాడు. త్వరగానే ఆన్‌లైన్‌ ఆటలో మెళుకువలు నేర్చుకొని అందులో విజేతగా నిలబడ్డాడు. మెదట్లో సరదాగా మెదలుపెట్టి తర్వాత విజేతగా నిలవటంతో, నిరంతరం దీనిపైనే ధ్యాస ఉండటంతో, ఆఫీసులోనూ ఇచ్చిన పనిసరిగ్గా చేయక ఉద్యోగం కోల్పోయాడు. 


ఆటలు ఆడటం ద్వారా శారీరక శ్రమ, మానసిక విశ్రాంతి లభిస్తుందని వేరే చెప్పనవసరం లేదు. గ్రామీణ ప్రాంతాల్లో ఇతర ఆటలతో పాటు చదరంగం, పులి-మేక, వామన గుంటలు, తదితర ఆటలతో పాటు సామెతలు, పద్యాలతో కూడిన కళారూపాలను కూడా ప్రదర్శించేవారు. ఆస్థానంలో సరికొత్త ఆటలు వస్తున్నాయి. ఆడుకుందాం రా..! అని తన మిత్రుడు సురేష్‌తో, శశాంక్‌ అన్నాడు. సరే..ఎన్ని గంటలకు ఆన్‌లైన్‌లో ఉంటావో చెప్పు వస్తా అని శశాంక్‌ అన్నాడు. క్లాస్‌ అయిపోయి ఇంటికి వెళ్లేటప్పుడు చెబుతా అని సురేష్‌ అన్నాడు. ఇలాంటి మాటలు నగరాల్లో చాలా సర్వసాధారణం అయిపోయాయి. ఇంటర్నెట్‌ ఛాటింగ్‌ మాత్రమే కాదు, ఇంటర్నెట్‌ గేమింగ్‌ ద్వారా కొత్త తరహా పరిచయాలు, మిత్రులు ఏర్పడుతున్నారని 9వ తరగతి చదువుతున్నటువంటి జోసఫ్‌ వెల్లడించారు. కేవలం హైస్కూల్‌ స్థాయిలోనే తమకు ప్రపంచవ్యాప్తంగా మిత్రులను ఏర్పాటు చేసుకునే సౌలభ్యం కలగటం మహదానందంగా ఉందని వారంటున్నారు. అయితే దీనివల్ల లాభనష్టాలు భేరీజు వేసుకుంటే మాత్రం టెక్నాలజీ పరంగా అత్యద్భుతంగా ఉన్నా జరుగుతున్న హాని అంతా ఇంతా కాదు.
డీప్‌బ్లూ కంప్యూటర్‌ తన విజయ10వ వార్షికోత్సవం జరుపుకుంటోంది. సరిగ్గా ఈనాటికి ప్రపంచ చదరంగ ఆటగాడు గ్యారీ కాస్పరోవ్‌ ఐబిఎమ్‌ డీప్‌బ్లూ కంప్యూటర్‌ చేతిలో ఓడిపోయాడు. 1997లో మొదలైన ఈ కంప్యూటర్‌ పోరు ఇప్పడు వేగం పుంజుకుంది. అయితే ఇది మానవ, కంప్యూటర్‌ల మధ్యన ఉన్నటువంటి తేడాను తెలియజేస్తున్నా, మనిషి మేధస్సు కంటే కంప్యూటర్‌ మేధస్సు ఎక్కువేమి కాదని నిపుణులు వెల్లడిస్తున్నారు.
ప్రత్యేకించి చదరంగం వంటి ఆటలో మనిషి అన్ని ఆటల కంటే ఎక్కువగా మెదడుకు శ్రమ పెడతాడు. దీంట్లో ఎదుటి వారి ఎత్తులకు పై ఎత్తులు వేయటానికి ఎన్నో రకాలుగా ఆలోచించాల్సి వస్తుంది. వారి ప్రతి ఎత్తును ఎన్నో రకాలుగా విశ్లేషించి తదుపరి ఎత్తువేయాలి. ఇలా వేసేటప్పుడు ఒక్కోసారి ఒత్తిడికి లోనయి తప్పులు చేస్తుంటారు. అందుకని కంప్యూటర్‌లో ఆటను ఆడేవారు తాము గతంలో ఆడిన ఆటలను చూస్తూ దానికి తాము వేసిన స్టెప్పు (ఎత్తులు) కాకుండా, కంప్యూటర్‌ ఏయే స్టెప్పులు వేస్తే మంచిదో విశ్లేషిస్తుంది. తద్వారా తర్వాత పోటీల్లో గెలవటానికి అవకాశాలు ఉన్నాయి.
1997 తర్వాత రెండు పోటీలు అందరినీ చదరంగ ప్రపంచంలో ఆకర్షించాయని చెప్పవచ్చు. http://www.gameoverllc.com/wp-content/uploads/2012/06/Free-Online-Games.jpg
2002 బ్రహెయిన్‌లో వ్లాదిమర్‌ క్రామ్నిక్‌, డీఫ్‌ ఫ్రీజ్‌ సూపర్‌ కంప్యూటర్‌కు మధ్యన జరిగిన పోరు.
2003 న్యూయార్క్‌లో కాస్పరోవ్‌, డీప్‌ జూనియర్‌ సూపర్‌ కంప్యూటర్‌తో జరిగిన ఆట.
ఈ రెండింటికీ బాగానే ప్రచారం లభించింది. దీనికి ప్రధాన కారణం చదరంగ ఆటను ఆడుతోంది ప్రపంచ జగజ్జేతలు, అదేస్థాయిలో ఉన్నటువంటి సూపర్‌ కంప్యూటర్స్‌. దీనికి న్యూయార్క్‌ స్పోర్ట్స్‌ కమిషన్‌ ఫస్ట్‌ వరల్డ్‌ చెస్‌ ఛాంపియన్‌షిప్‌, ఎఫ్‌ఐడిఇ, ఇంటర్నేషనల్‌ గవర్నింగ్‌ బాడీ ఆఫ్‌ చెస్‌, ఇంటర్నేషనల్‌ కంప్యూటర్‌ గేమ్‌ అసోసియేషన్‌ సంయుక్తంగా నిర్వహించాయి.
ఇలా నిర్వహించటం ద్వారా రెండు రకాలైనటువంటి ఉపయోగాలున్నాయని నిపుణులు వెల్లడిస్తున్నారు. ఒకటి కంప్యూటర్‌ సామర్థ్యాన్ని అంచనా వేయటం కన్నా ఆటగాడి ప్రతిభకు మెరుగుదిద్దుకునే అవకాశం. మనిషి తోటి వ్యక్తితో ఆడటం వేరు. మనిషి, యంత్రంతో పోటీ పడటం వేరు. మనిషి కంటే యంత్రం శక్తివంతమైనది అయినా, మనిషి ఆలోచనా విధానాన్ని అది నియంత్రించలేదు. ఇదంతా ఆధునిక ఆటలో ఒకభాగం. కంటికి కనిపించని రెండో పార్వశం కూడా ఉంది.
అదేమిటంటే...ఆటలు ఆడటానికి స్కూల్‌లో ఒక నిర్ణీత సమయం అంటూ ఉంటుంది. శారీరకంగా వ్యాయామం, తర్వాత విశ్రాంతి తీసుకోవటం ద్వారా మెదడు సైతం చురుగ్గా పనిచేస్తుంది. అయితే మారినటువంటి ఆధునికమైన ఆటల వల్ల తమకు తెలియకుండా ఇంటర్నెట్‌ మీద గేమింగ్‌ చేసేవారు దానికి బానిసగా మారుతున్నారు. అదేపనిగా గంటల తరబడి ఆడటం వల్ల ఏకాగ్రత దెబ్బతిని డిప్రెషన్‌కు గురవుతున్నారు. అన్ని రకాలుగా నష్టపోతున్నారు. వాస్తవానికి నగరాల్లో పెరుగుతున్న ఆధునిక జీవన విధానమూ దీనికి దోహదం చేస్తోంది. పక్కన ఉన్నవారితో ఒకరితోఒకరు మాట్లాడుకోవటానికి వీలులేకుండా ప్రతి రోజూ బిజీ అయిపోవటమే. వీలైనంత వరకు ప్రతి రోజు ఉదయాన్నే వాకింగ్‌, జాగింగ్‌, మెడిటేషన్స్‌ చేయటం ద్వారా డిప్రెషన్‌ నుంచి కొంతమేర ఉపశమనం పొందవచ్చు.
కంప్యూటర్‌ ప్రభావం అన్ని ఆటల మీద ప్రభావం చూపుతోంది. ఉదాహరణకు క్రికెట్‌లో ఒక ఆటగాడిని అవుట్‌ చేయాలి అని ప్రత్యర్థి జట్టు బౌలర్‌ అనుకున్నాడు. ఉదాహరణకు సచిన్‌ టెండుల్కర్‌ వీక్‌నెస్‌ ఏమిటి? ఎక్కడ బంతి వేస్తే ఎలా స్పందిస్తాడు అని కంప్యూటర్‌ను ఆశ్రయించి, అవుట్‌ చేయటం నేడు ప్రధాన ఆయుధంగా మారింది. అంతేగాక తన బౌలింగ్‌లో లోపాలను సైతం కంప్యూటర్‌ విశ్లేషణల ద్వారా విశదీకరించుకొని తర్వాత మ్యాచ్‌ల్లో మరింత మెరుగ్గా ఆటను ప్రదర్శిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా క్రీడల్లో కంప్యూటర్‌ ఎంతలోతుకు చొచ్చుకుపోయిందో దీనిబట్టే ఇట్టే అర్థమౌతుంది.
 

Post a Comment

0 Comments

Close Menu