Ad Code

నోకియా బ్యాటరీలు ఫెయిల్యూర్‌

అగ్రగామి సెల్‌ తయారీ సంస్థ నోకియాకి చెందిన బ్యాటరీలు నాలుగు కోట్ల అరవై లక్షల వరకు ఫెయిల్‌ అయ్యాయి.వీటి స్థానంలో కొత్తవాటిని ఇవ్వనున్నట్లు నోకియా ప్రకటించింది. గతంలో ఈ సంస్థకు చెందిన బ్యాటరీలు ఫెయిల్యూర్‌ అయ్యాయని వార్తాకథనం వచ్చిన నేపధ్యంలో సంస్థ దాన్ని కొట్టిపారేసింది. ఇదంతా వదంతులుగా తీసేసింది. అయితే తాజాగా నోకియానే తాను స్వయంగా నిర్వహించినటువంటి భద్రతా పరీక్షల్లో బిఎల్‌-5సి రకం బ్యాటరీలు ఫెయిల్యూర్‌ అయ్యాయని వెల్లడించింది.
ఈ మోడల్‌ బ్యాటరీలు మత్యుషితా తయారీగా నోకియా వెల్లడించింది. ఇవి 2005 డిసెంబర్‌, 2006 నవంబర్‌ మధ్యన తయారైనవిగా వెల్లడించింది. ఇప్పటికే చాలావాటిని వెనక్కు తెప్పించి రీఫ్లేస్‌ చేయనున్నట్లు సంస్థ వెల్లడించింది. గతంలో బ్యాటరీలు పేలటానికి సెల్‌ఫోన్‌ వినియోగదారుడి నిర్వహణా లోపంగా కంపెనీలు వెల్లడించాయి. కాగా, ప్రస్తుతం ఈ వార్తా కథనం ప్రకరం కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో ఈ బ్యాటరీలు పేలి ప్రమాదం సృష్టించే అవకాశాలు ఉన్నాయని వెల్లడైంది. సంస్థ వెల్లడించిన సమాచారం మేరకు బ్యాటరీలు పేలిపోవటానికి వందవరకు కారణాలు ఉన్నాయని వాటిలో ఉన్నటువంటి వాటిలో అంతర్గత లోపాలు, ఎలక్ట్రానిక్‌ పరికరాలను వినియోగదారుడు మెయింటెన్స్‌పై బ్యాటరీ జీవితకాలం ఆధారపడి ఉంటుందని సంస్థ తెలుపుతోంది. ప్రత్యేకించి ఈ బిఎల్‌సి-5 మోడల్‌ను ఇతర వేరే మోడల్‌ సెల్‌ఫోన్స్‌లో వినియోగించినప్పుడే ఇది పేలే అవకాశాలున్నట్లు సంస్థ తెలియజేస్తోంది.
బ్యాటరీలు పేలిపోవటానికి అనేక రకాలైన కారణాలున్నా, ప్రధానంగా ప్రముఖ సెల్‌తయారీ సంస్థ ఈ స్థాయిలో బ్యాటరీలను రీప్లేస్‌మెంట్‌కు ఇవ్వటం ఇదే తొలిసారిగా నిపుణులు వెల్లడిస్తున్నారు. గతంలో ల్యాప్‌టాప్‌ తయారీ సంస్థ డెల్‌ సైతం బ్యాటరీలను రీప్లేస్‌మెంట్‌ చేసిందని వారు గుర్తుచేస్తున్నారు. ఎలక్ట్రానిక్‌ పరికరాలను ఖచ్చితంగా ఇంతకాలం పనిచేస్తాయని కంపెనీ గ్యారంటీ ఇచ్చినా, తర్వాత కొద్దికాలానికే ఫెయిల్యూర్‌ అయితే దానికి ఎటువంటి రీప్లేస్‌మెంట్‌ చేయరు.
ప్రస్తుతం కంపెనీ ఇచ్చిన వారంటీ దాటిన వాటికి సైతం పాత బ్యాటరీల స్థానంలో కొత్తవి ఇవ్వనున్నట్లు సంస్థ వెల్లడించింది. అయితే సెల్‌ఫోన్‌ కొనుగోలు చేసిన ఒరిజినల్‌ బిల్‌ ఉన్నవాటికే ఈ అవకాశం ఉన్నట్లు సంస్థ తెలుపుతోంది. దీనికి సంబంధించిన మరింత సమాచారం కోసం 01130303832 , 08030303838 అనే నెంబర్లకు ఫోన్‌ చేయవచ్చునని భారత్‌లోని నోకియా సంస్థ వెల్లడించింది. లేకపోతే, గీగీగీ.దీళిదిరిబి.బీళిళీ అనే వెబ్‌సైట్‌లో దీనికి సంబంధించిన వివరాలు పొందవచ్చు.
ఎందువల్ల పేలతాయి..?
బి సెల్‌ఫోన్‌ను ఛార్జింగ్‌ చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలను నిపుణులు వెల్లడిస్తున్నారు. అవి ఇదిగో...
బి సెల్‌ఫోన్‌ను వినియోగించే ముందు కంపెనీ యూజర్‌ మాన్యువల్‌ పూర్తిగా చదివి అర్థం చేసుకోవాలి. దాని ప్రకారమే సెల్‌ఫోన్‌ను ఛార్జింగ్‌ చేయాలి. సెల్‌ తయారీ కంపెనీ సెల్‌ఫోన్‌ను రెండు నుంచి మూడున్నర గంటల సేపు మాత్రమే ఛార్జింగ్‌ చేయాలని సూచిస్తుంది.
బి సెల్‌ఫోన్‌ను గంటల తరబడి ఛార్జింగ్‌ చేయటం ద్వారా దాని జీవిత కాలం తగ్గిపోతుంది.
బి ఛార్జింగ్‌లో ఉంచి మాట్లాడటం చేత ఒక్కోసారి దానిలో ఒత్తిడి ఏర్పడటం వల్ల అది పేలిపోయే అవకాశాలున్నాయి.
బి ఒక్కోసారి సెల్‌ఫోన్‌లో నీరు, తేమ చేరటం వల్ల అది ఛార్జింగ్‌ చేయటం వల్ల అందులో విద్యుత్‌ సరఫరా అయ్యే సందర్భాల్లోనూ పేలిపోయే అవకాశాలున్నాయి. అందుచేత సెల్‌ఫోన్‌లోకి తేమ చేరకుండా చూడాలి. వేడి ప్రాంతంలో ఉంచి ఛార్జింగ్‌ చేసినా అది పేలిపోయే అవకాశాలున్నాయి.
బి బ్యాటరీ ఎక్స్‌ఫ్లోజివ్‌ అని దానిపై హెచ్చరిక ఉంటుంది. పనికిరాని బ్యాటరీలను డస్ట్‌బిన్‌లో వేయాలి. పిల్లల చేతికి ఇస్తే దాన్ని వారు ప్రమాదవశాత్తు నిప్పులో వేస్తే పేలే అవకాశం ఉంటుంది.
బి ఖరీదు కాస్త ఎక్కువైనా, కంపెనీ సిఫార్సు చేసిన షోరూమ్‌ల్లో ఒరిజినల్‌ బ్యాటరీలు కొనుగోలు చేయటం ద్వారా నకిలీల బారినుంచి కాపాడుకోవచ్చు.
బి బ్యాటరీ వెంటవెంటనే తగ్గిపోతుంటే, సొంత ప్రయోగాలు చేయటం కన్నా, షోరూమ్‌లో నిపుణులైన మెకానిక్‌ల వద్ద పరీక్ష చేయించటం ఉత్తమం.

Post a Comment

0 Comments

Close Menu