5000 మంది ఈ వ్యాధితో మరణించవచ్చని నేషనల్‌ కేన్సర్‌ ఇనిస్టిట్యూట్‌ గుర్తించింది

పట్టుమని పదినిమిషాల్లో నోటి కేన్సర్‌ కణాలను గుర్తించే మైక్రోఫ్లూడిక్స్‌ పరికరాన్ని యూనివర్సిటీ ఆఫ్‌ టెక్సాస్‌ పరిశోధకులు అభివృద్ధి చేస్తున్నారు. ఈ డివైజ్‌ డెంటిస్ట్‌లకు సులభతరంగా, వ్యయపరంగా కూడా అందుబాటులో ఉంటుందని వారంటున్నారు. సర్వికల్‌ కేన్సర్‌తో సహా ఇతర కేన్సర్‌లను పరీక్షించేందుకు కూడా ఈ డివైజ్‌ ఉపకరిస్తుంది. లాబ్‌లో పెరిగే కేన్సర్‌ కణాలపై ఇది సమర్ధవంతంగా పనిచేస్తోంది. నోటి కేన్సర్‌ రోగుల నుండి బయోప్సిస్‌పై ప్రస్తుతం దీన్ని పరీక్షిస్తున్నారు. చాలా వరకూ ఓరల్‌ కేన్సర్‌లు ప్రాథమిక దశలో నొప్పి ఉండకపోవడంతో రోగులు, వైద్యులు వాటిని గుర్తించలేకపోతారని నేషనల్‌ కేన్సర్‌ ఇనిస్టిట్యూట్‌ ఆన్‌ డెఫ్‌నెస్‌ అండ్‌ అదర్‌ కమ్యూనికేషన్‌ డిజార్డర్స్‌లో హెడ్‌ అండ్‌ నెక్‌ సర్జరీ విభాగం అధిపతి కార్టర్‌ వాన్‌ వేస్‌ అంటున్నారు. ఈ ఏడాది 22,560 మందిలో ఓరల్‌ కేన్సర్‌ గుర్తించవచ్చని, 5000 మంది ఈ వ్యాధితో మరణించవచ్చని నేషనల్‌ కేన్సర్‌ ఇనిస్టిట్యూట్‌ గుర్తించింది. అస్టిన్‌లోని యూనివర్సిటీ ఆఫ్‌ టెక్సాస్‌కు చెందిన కెమిస్ట్రీ ప్రొఫెసర్‌ జాన్‌ మెక్‌డెవిట్‌ ఈ పరికరాన్ని అభివృద్ధి చేస్తున్నారు. కేన్సర్‌ పేషంట్లను ముందుగా గుర్తించడమే కీలకమని, తర్వాతి దశల్లో రోగులు చికిత్సకు మెరుగ్గా స్పందించరని కేవలం యాభై శాతం మంది మాత్రమే ఆ దశలో కోలుకునే అవకాశం ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు.

No comments

Telugu Unicode Converter Online

click here http://kolichala.com/font2unicode/Encoder/unicode2font.php

Powered by Blogger.