'దేవర' ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ రద్దు !


'దేవర' ముందస్తు విడుదల వేడుక రద్దయ్యింది. పరిమితికి మించి అభిమానులు రావడంతో వేదిక ప్రాంగణంలో గందరగోళ పరిస్థితి నెలకొంది. జనరల్‌ పాసులు పొందిన వారూ వీఐపీ గ్యాలరీలోకి, సెలబ్రిటీ గ్యాలరీలోకి దూసుకెళ్లడంతో తోపులాట జరిగింది. ఆడిటోరియం నిండిపోవడంతో కొంతమంది బయటే ఉండాల్సి వచ్చింది. కొందరు అభిమానులు హోటల్‌ అద్దాలు, కుర్చీలు పగలగొట్టడం ఉద్రిక్తతకు దారితీసింది. పోలీసులు నిలువరించే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. హోటల్‌ యాజమాన్యం అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఆర్గనైజర్స్‌ ఈవెంట్‌ను రద్దు చేశారు. అతిథిగా విచ్చేసిన దర్శకుడు త్రివిక్రమ్‌, నిర్మాత నాగవంశీ వెనుదిరిగి వెళ్లినట్టు తెలిసింది. ఎన్టీఆర్‌ హీరోగా దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించిన పాన్‌ ఇండియా చిత్రమిది. జాన్వీ కపూర్‌ హీరోయిన్‌. సైఫ్‌ అలీఖాన్‌ కీలక పాత్ర పోషించారు. ఈ నెల 27న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్న నేపథ్యంలో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఓ హోటల్‌లో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. కాగా ఇది రద్దయ్యింది.

Next Post Previous Post
No Comment
Add Comment
comment url




sr7themes.eu.org