తమిళ హీరో జీవాకు రోడ్డు ప్రమాదం


మిళ హీరో జీవా చైన్నై నుంచి సేలం వెళ్తుండగా కన్నియమూర్ వద్ద ఆయన కారు బారికేడ్‌ను ఢీకొట్టింది. అడ్డుగా వచ్చిన బైక్ ను తప్పించబోవడంతో ఈ ప్రమాదం జరిగినట్లు కోలీవుడ్ వర్గాల సమాచారం. ఈ ప్రమాదంలో కారు తీవ్రంగా దెబ్బతిన్నప్పటికీ, అదృష్టవశాత్తూ జీవా తనతో పాటు ఉన్న ఆయన భార్యకు ఎలాంటి గాయాలు కాలేదు. జీవా తమిళంలోనే కాదు తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితం. జీవా తెలుగులో రంగం సినిమాతో పరిచయమయ్యాడు. ఆ తర్వాత డైరెక్టర్ మహి.వి రాఘవ్ తెరకెక్కించిన యాత్ర2లో జగన్ పాత్రలో జీవా నటించి శభాష్ అనిపించుకున్నాడు.

Next Post Previous Post
No Comment
Add Comment
comment url




sr7themes.eu.org