దేవరపల్లి ప్రమాదంపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి !


ఆంధ్రప్రదేశ్ లో జరిగిన ప్రమాదంపై ముఖ్యమంత్రి  చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. దేవరపల్లి మండలం, చిలకావారిపాకలులో జీడిపిక్కల లోడ్‍తో వెళ్తున్న లారీ ప్రమాదవశాత్తు బోల్తా కొట్టిన విషయం తెలిసిందే. ఈ ఘోర ప్రమాదంలో ఏడుగురు కూలీలు మృతి చెందడంపై సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. లారీలో ప్రయాణిస్తున్న కూలీలు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం తనను కలచివేసిందని సీఎం చంద్రబాబు వెల్లడించారు. బాధిత కుటుంబాలకు తమ ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. అయితే, ఈ ప్రమాదంలో గాయపడిన వారికిమెరుగైన వైద్యసేవలు అందించాలని సంబంధిత అధికారులను సీఎం ఆదేశించారు.

Next Post Previous Post
No Comment
Add Comment
comment url




sr7themes.eu.org