భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు
అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులు, డిమాండ్ తదితర కారణాలతో పసిడి, వెండి ధరలు రోజురోజుకూ పైపైకి కదులుతున్నాయి. బంగారం, వెండి ధరలు మరోసారి భారీగా పెరిగాయి. తాజాగా హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 10 గ్రాముల బంగారం ధర రూ.880 వరకు పెరగగా, కిలో వెండి ధర ఏకంగా రూ.5,000 పెరిగింది. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం ధర గ్రాముకు రూ.16,397గా ఉంది. 99.9 శాతం స్వచ్ఛత కలిగిన 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.880 పెరిగి రూ.1,63,970కు చేరింది. అదేవిధంగా 22 క్యారెట్ల బంగారం గ్రాము ధర రూ.15,030గా ఉంది. 91.6 శాతం స్వచ్ఛత కలిగిన 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.800 పెరిగి రూ.1,50,300 వద్ద ట్రేడ్ అవుతోంది. 18 క్యారెట్ల బంగారం గ్రాము ధర రూ.12,293గా ఉంది. ఇది 75 శాతం స్వచ్ఛత కలిగిన బంగారం. ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,64,120 వద్ద అమ్ముడవుతోంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,50,450 వద్ద ట్రేడ్ అవుతోంది. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో కిలో వెండి ధర రూ.5,000 పెరిగి రూ.2,75,000కు చేరింది. ఢిల్లీలో కిలో వెండి ధర రూ.2,60,000 వద్ద కొనసాగుతోంది. బంగారం, వెండి ధరలు వరుసగా పెరుగుతుండటంతో నగలు కొనుగోలు చేయాలనుకునే వినియోగదారులపై అదనపు భారం పడుతోంది.