రోడ్డు ప్రమాదంలో విజయవాడ ట్రాఫిక్‌ డీసీపీ కుమార్తె దుర్మరణం

ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లాలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో విజయవాడ ట్రాఫిక్‌ డీసీపీ షరీన్‌ బేగం కుమార్తె హఫీసా బేగం (24) మృతి చెందారు. ఆమెతో పాటు కారులో తాడేపల్లికి చెందిన ఉండి రుత్విక్‌ (జిమ్‌ నిర్వాహకుడు), అవినాష్, సుధీర్, షేక్‌ ఆసిఫా, వంశీ స్నేహితులు ప్రయాణిస్తున్నారు. వీరిలో ఒకరు ప్రమాదంలో తీవ్రంగా గాయపడినట్లు పోలీసులు తెలిపారు. గుంటూరు ఎస్పీ వకుల్‌ జిందాల్‌ తెలిపిన వివరాల ప్రకారం హఫీసా బేగం తన స్నేహితులతో కలిసి కారులో ప్రయాణిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. కారు ముందు వెళ్తున్న లారీ సడెన్‌గా బ్రేక్‌ వేయడంతో వెనుక నుంచి ఢీ కొట్టి రోడ్డు పక్కనున్న డివైడర్‌ను తాకి ఆగిపోయింది. హైవే పెట్రోలింగ్‌ సిబ్బంది అక్కడికి వచ్చి క్షతగాత్రులను సమీపంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి ఆసిఫా అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. ఘటనపై నల్లపాడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రస్తుతం క్షతగాత్రుల పరిస్థితి నిలకడగా ఉన్నట్లు గుంటూరు ఎస్పీ తెలిపారు.

Next Post Previous Post
No Comment
Add Comment
comment url




sr7themes.eu.org