ఆఫర్ ఫర్ సేల్ పద్ధతి ద్వారా ఎల్ఐసీలో 6.5 శాతం వాటాను విక్రయించేందుకు సిద్ధమైన కేంద్రం

ఫర్ ఫర్ సేల్ పద్ధతి ద్వారా భారత లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ లో 6.5 శాతం వాటాను విక్రయించేందుకు కేంద్రం సిద్ధమైంది. ఈ ప్రక్రియ ద్వారా సుమారు 82.22 కోట్లకు పైగా షేర్లను విక్రయించి, రూ. 31,000 కోట్లకు పైగా నిధులను సమీకరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ OFS కోసం ఒక్కో షేరు కనీస ధరను రూ. 382గా ఖరారు చేశారు. నిన్నటి ముగింపు ధర Rs.424తో పోలిస్తే సుమారు 10 శాతం డిస్కౌంట్‌కే ఈ షేర్లను ఆఫర్ చేస్తుండటం విశేషం. మొదట నాన్-రిటైల్ ఇన్వెస్టర్లకు అందుబాటులోకి రాగా, మరుసటి రోజున రిటైల్ ఇన్వెస్టర్ల బిడ్డింగ్ కోసం తెరవబడుతుంది. ప్రస్తుతం ఎల్‌ఐసీ సంస్థలో కేంద్ర ప్రభుత్వానికి ఏకంగా 96.5 శాతం మేర మెజారిటీ వాటా ఉంది. ఈ 6.5 శాతం విక్రయం ద్వారా సెబీ నిబంధనలకు అనుగుణంగా పబ్లిక్ షేర్ హోల్డింగ్‌ను పెంచడంతో పాటు, తమ వాటాల విక్రయ లక్ష్యాలను పూర్తి చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. మార్కెట్ ధర కంటే తక్కువ ధరకు షేర్లు లభిస్తుండటంతో ఇన్వెస్టర్లలో విశేష ఆసక్తి నెలకొంది.

Next Post Previous Post
No Comment
Add Comment
comment url




sr7themes.eu.org