యువత భవిష్యత్తు - సంక్షేమం కంటే తమకు ప్రాధాన్యత ఏదీ లేదు : ప్రధాని నరేంద్ర మోడీ ఎక్స్ లో పోస్టు

కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని ఢిల్లీలో నిరసనలు హోరెత్తుతున్నాయి. నాలుగు రోజులుగా ఢిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ, ఇటు కాంగ్రెస్ పార్లమెంట్ లో ఆందోళనలు కొనసాగిస్తున్నాయి. పార్లమెంట్ సైతం జరగటం లేదు. ప్రభుత్వం చర్చలకు ప్రతిపాదించినా విపక్షం తగ్గటం లేదు. ఈ సమయంలో ప్రధాని మోడీ కీలక ప్రకటన చేసారు. యువత భవిష్యత్ - సంక్షేమం కంటే తమకు ప్రాధాన్యత ఏదీ లేదని స్పష్టం చేసారు. పేపర్ లీకు వ్వవహారం పై వేగంగా విచారణ- శిక్ష కోసం ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. పరీక్షా పత్రాల లీకేజీ కేసులలో ప్రమేయం ఉన్నవారికి వేగవంతమైన విచారణ జరిపి, కఠిన శిక్ష విధించేలా కేంద్ర ప్రభుత్వం ఫాస్ట్-ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేస్తుందని ప్రధాని ప్రకటించారు. ఈ మేరకు ప్రధాని ఈ రోజు ఎక్స్ లో చేసిన పోస్టులో కీలక అంశాలను ప్రస్తావించారు. దేశ యువత సంక్షేమం, భవిష్యత్తు ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యతగా వెల్లడించారు. ఈ నిర్ణయాన్ని అమలు చేయడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు, అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు ఆయన పేర్కొన్నారు. విద్యార్థుల ప్రయోజనాలను కాపాడటం, పరీక్షా వ్యవస్థ సమగ్రతను పరిరక్షించడం లక్ష్యంగా తీసుకున్న చర్యల పరంపరలో ఈ నిర్ణయం కూడా ఒక భాగంగా వివరించారు. అదే విధంగా పేపర్ లీక్‌ల ద్వారా దేశ యువత భవిష్యత్తును ప్రమాదంలో పడేయాలని చూసే వారిని వదిలిపెట్టబోమని ఆయన గట్టి హెచ్చరిక జారీ చేశారు. ప్రధాని ప్రకటనతో ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీ, విపక్షాలు ఏ విధంగా స్పందిస్తాయనేది కీలకంగా మారుతోంది. ఆందోళనలు విరమించేందుకు.. పార్లమెంట్ జరిగేలా సహకరించేందుకు ప్రధాని మోడీ ఈ ప్రకటన చేసారు. పార్లమెంట్ లోనూ ప్రభుత్వం పేపర్ల లీక్ అంశం పైన చర్చకు సిద్దమని ముందుకు వచ్చింది. అయితే, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన తరువాతనే చర్చ చేపట్టాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. నిరసనలు కొనసాగుతున్న వేళ మద్దతు పెరుగుతుండటంతో ప్రధాని ఇప్పుడు ఈ ప్రకటన చేసారు. 

Next Post Previous Post
No Comment
Add Comment
comment url




sr7themes.eu.org