ట్రాక్టర్ పైనుంచి పడి వ్యక్తి అక్కడికక్కడే మృతి
ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతి జిల్లా నాయుడుపేట లోని చిగురుపాడు వద్ద చలివేంద్రం నుండి చిగురుపాడు చెరువు కు వెళ్తున్న ట్రాక్టర్ మీద నుండి కింద పడి వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది, ఉదయం 8.30 నిమిషాల సమయంలో ఈ ప్రమాదం జరిగినట్టు స్థానికులు తెలుపుతున్నారు, మృతి చెందిన వ్యక్తి ముసులూరు రవి (48) చిగురుపాడు చవట హరిజనవాడకు చెందిన వ్యక్తిగా స్థానికులు తెలియజేస్తున్నారు, ట్రాక్టర్ మీద నుంచి పడి వ్యక్తి మృతి చెందడంతో మృతుని కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి, ఉదయం ఇంటి వద్ద నుండి పనికి వెళ్లే సస్తానన్న వ్యక్తి మృతి చెందడంపై మృతుడి కుటుంబ సభ్యులు దుర్భాతి వ్యక్తం చేస్తున్నారు, అసలు ఏం జరిగింది ఎలా చనిపోయారు అనే దాని పన పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు, పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు, అసలు ప్రమాదం జరగడానికి కారణాలు ఏమిటో తెలుసుకోవాలని పోలీసులకు తెలియజేస్తున్న రవి కుటుంబ సభ్యులు, రవి మృతితో చిగురుపాడు గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.