Friday, July 17, 2026

భార్యాభర్తల గొడవలో భర్త తమ్ముడు మృతి

ఆంధ్రప్రదేశ్ లోని  పల్నాడు జిల్లా మాచర్ల మండలంలో రేగులవరం తండాలో గురువారం రాత్రి ఇరువర్గాల మధ్య చెలరేగిన ఘర్షణ, దాడిలో అక్కడికక్కడే ఒకరు చెందారు. రెండు నెలల క్రితం భరత్ నాయక్, అనూషలకు వివాహం జరిగింది. అయితే తరచూ గొడవలతో పంచాయతీలు జరుతున్నాయి. ఈ క్రమంలో మాట్లాడుకుందామంటూ గొడవకు దిగిన భార్య తండ్రి అంజి నాయక్, మరో 15 మందితో కలిసి చేసిన దాడిలో భరత్ నాయక్ తమ్ముడు బర్మా నాయక్ గాయపడి మృతి  చెందాడు. మృతదేహాన్ని మాచర్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.ఈ ఘటన పై విజయపూరి సౌత్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.