రూ. 153 కోట్లతో ధవళేశ్వరం బ్యారేజీకి కొత్త గేట్లు : రేపు పనులను అధికారికంగా ప్రారంభించనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు
ధవళేశ్వరం బ్యారేజీకి కొత్త గేట్లు అమర్చే అత్యంత కీలకమైన పనులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు అధికారికంగా ప్రారంభించనున్నారు. రూ.152.95 కోట్లతో 117 పాత ఫ్లడ్ గేట్ల స్థానంలో కొత్త గేట్లను ఏర్పాటు చేయనున్న ది. గతంలో 2014 తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో రూ. 31.77 కోట్ల వ్యయంతో 58 గేట్లకు మరమ్మతులు చేపట్టారు. అయితే వైసీపీ సర్కార్ బ్యారేజ్ రక్షణ విషయంలో తీవ్ర నిర్లక్ష్యం చోటుచేసుకుందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. సెంట్రల్ వాటర్ కమిషన్ సూచనల మేరకు బ్యారేజ్ గేట్ల మార్పిడి ప్రక్రియను వేగవంతం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ముందడుగు వేసింది. ఈ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిచ్చుకలంక గ్రామంలో స్థానిక రైతులతో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు.