వియత్నాం పడవ ప్రమాదం : 15 మంది భారతీయులు మృతి

వియత్నాంలో ప్రముఖ పర్యాటక ప్రాంతమైన 'ఫు క్వాక్' ద్వీపం సమీపంలో పర్యాటకులతో వెళ్తున్న ఒక స్పీడ్ బోట్ సముద్రంలో బోల్తా పడటంతో ఈ దారుణం జరిగింది. మొత్తం 32 మంది భారతీయ పర్యాటకులు, నలుగురు సిబ్బందితో కూడిన ఈ పర్యాటక బోట్.. థాయిలాండ్ గల్ఫ్ పరిధిలోని ఫు క్వాక్ ద్వీపం సమీపంలో విహారయాత్రను ముగించుకుని, తిరిగి 'అన్ థోయ్' పోర్టుకు వస్తుండగా ఒక్కసారిగా తిరగబడింది. ఈ ప్రమాదంలో 15 మంది భారతీయులు మరణించగా, మిగిలిన 21 మందిని రెస్క్యూ సిబ్బంది సురక్షితంగా రక్షించారు. ప్రాణాలతో బయటపడిన వారిలో 17 మంది పర్యాటకులు, నలుగురు బోట్ సిబ్బంది ఉన్నారు. బోటులో ఉన్న మొత్తం 36 మంది వివరాలు లభ్యమయ్యాయని, అయితే ప్రాణాలతో బయటపడిన వారిలో ఇద్దరి పరిస్థితి ప్రస్తుతం అత్యంత విషమంగా ఉందని అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో మరణించిన 15 మందిలో అత్యధికంగా తమిళనాడుకు చెందిన వారు 10 మంది ఉండగా, ఆంధ్రప్రదేశ్ నుండి ముగ్గురు, కేరళకు చెందిన వారు ఇద్దరు ఉన్నట్లు అధికారులు ధృవీకరించారు. హనోయిలోని భారత రాయబార కార్యాలయం (ఎంబసీ) మరణించిన 15 మంది వివరాలను అధికారికంగా విడుదల చేసింది.

Next Post Previous Post
No Comment
Add Comment
comment url




sr7themes.eu.org